Anchor Anasuya: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ల సందడి.. వీడియో వైరల్

ఉప్పల్ స్టేడియంలో యాంకర్ల సందడి.. వీడియో వైరల్

Anchor Anasuya: ఐపీఎల్ 2024 మ్యాచ్ తిలకించేందుకు అభిమానులతో పాటు సెలబ్రెటీలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినా సెలబ్రెటీలు అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు.

Anchor Anasuya: ఐపీఎల్ 2024 మ్యాచ్ తిలకించేందుకు అభిమానులతో పాటు సెలబ్రెటీలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ లు జరిగినా సెలబ్రెటీలు అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ ముచ్చటే నడుస్తుంది. క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ సీజన్ అంటే పండుగ వాతావరణం అన్నట్లే. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా మ్యాచ్ జరిగే సమయానికి టీవీలకు అతుక్కుపోతుంటారు. ఐపీఎల్ 2024 లో భాగాంగా గురువారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ యారల్స్ జట్ల మధ్య పోరు ఎంతో ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అభిమానులే కాదు.. సెలబ్రెటీలు సైతం మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా తెలుగు బుల్లితెర యాంకర్లు ఫుల్ జోష్ తో తెగ ఎంజాయ్ చేశారు. వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 మొదలైనప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో కోలాహలం నెలకొంది. వివిధ రాష్ట్రాల నుంచి క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడటానికి ముందు రోజు నుంచే స్టేడియం వద్ద సందడి చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులతో పాటు తెలుగు యాంకర్లు తెగ సందడి చేశారు. బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, శ్రీముఖి గ్యాలరీలో ఫుల్ జోష్ తో హంగామా చేశారు. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్స్ ఫోర్లు, సిక్స్ లు కొడుతుంటే అనసూయ ఎంగిరి గంతులేస్తూ.. క్యాచ్ లు వదిలివేస్తే తల పట్టుకుంటూ బాధపడుతూ రియాక్షన్ ఇస్తున్నారు.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 15వ ఓవర్ లో జయదేవ్ ఉనాద్కత్ వేసిన బాల్ కి రియాన్ పరాగ్ భారీ షాట్ అడాడు.. లాంగాన్ లో అబ్దుల్ సమద్ క్యాచ్ కు ప్రయత్నించగా మిస్ అయ్యింది.. అది చూసి అయ్యో అంటూ నిట్టూర్పు విడిచింది అనసూయ. ఈ రియాక్షన్ కెమెరామాన్ తన కెమెరాలో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. అందాల భామ యాంకర్ శ్రీముఖి తన బంధువులలో కలిసి గ్యాలరీలో తెగ హంగామా చేస్తూ.. విక్టరీ ఫోటో ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీముఖికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Show comments