iDreamPost
android-app
ios-app

అమ్మడి అనసూయ కష్టాలు పగవాడికి కూడా..

యాంకరింగ్ నుండి స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది అనసూయ భరధ్వాజ్. ఇప్పుడు ఆమె పలు సినిమాలు చేస్తూ పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ.. లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటుంది.

యాంకరింగ్ నుండి స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది అనసూయ భరధ్వాజ్. ఇప్పుడు ఆమె పలు సినిమాలు చేస్తూ పూర్తిగా యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ.. లేని పోని తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటుంది.

అమ్మడి అనసూయ కష్టాలు పగవాడికి కూడా..

అంతకు ముందే అనసూయకి కొంత క్రేజ్ వచ్చిందన్న మాట వాస్తవం. రంగస్థలం సినిమాతో మరి అనసూయ స్థాయి ఆకాశాన్ని అంటుకుంది. పైగా సినిమాలో అనసూయ క్యారెక్టర్ అదే రంగమ్మత్త పిచ్చ మాస్ ట్రెండ్లో ఉండడం, ఆ సినిమా ఇరగదీసి అడడంతో అమ్మడి క్రేజ్ పబ్లిక్లో అమాంతం పెరిగిపోయి, పరిశ్రమలో కూడా డిమాండ్ వీర లెవెల్లో పెరిగిపోయి తనే హేండిల్ చేసుకోలేని రేంజ్కి చేరుకుంది. సుకుమార్ పుణ్యమా అని అనసూయ ఉంటే సినిమాకే ఓ క్రేజ్ అన్నట్టుగా తయారైంది ఇటీవల. మామ్మూలుగానే సోషల్ మీడియాలో దుమారం లేపే అనసూయకి రంగస్థలం క్రేజ్ మామ్మూలుగా కలసిరాలేదు.

అనసూయది చిన్నఫోటో కనబడితే చాలు పేద్ద సునామీ వచ్చనట్టే. ఇంక ఆ ఫోటో మీద కధనాలు కుప్పలు తెప్పలుగా విరుచుకుపడతాయి. అంతటితో సరికాదు. ఆ కథనాలకి అమ్మడు తెగ రియాక్ట్ అయి, పోస్టులు పెడుతుంది. దాంతో యూత్ మరింత రెచ్చిపోతారు. ఇదంతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద పెద్ద లొల్లిలా తయారైంది. నిజానికి చెప్పాలంటే అనసూయ సోషల్ మీడియాకి మహారాజపోషకురాలు స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అనసూయంత పాప్యులారిటీని చవిచూసిన నటీమణి మరొకరు లేరంటే మాత్రం అతిశయోక్తి కానేకాదు. ఈ పాప్యులారిటీయే అనసూయ కొంప ముంచుతోంది. దీనికి తోడు అనసూయ అట్టాంటి ఇట్టాంటి రకం కాదు. తనదైన భావావేశాలను కూడా యధేచ్ఛగా వ్యక్తం చేసే గొప్ప డేరింగ్ అండ్ డేషింగ్ పర్సన్ కావడం మరో ముప్పు.

ఆ మధ్య విజయ్ దేవరకొండ పేరుకి ముందు ధి అని ఉండని అమ్మడు గొప్ప ఆగ్రహానికి గురైంది. వెంటనే ఓ పోస్ట్ పెట్టి పారేసింది. విజయ్ దేవరకొండను విమర్శించే ధోరణిలో, ఇలా ఎవరైనా పెట్టుకుంటారా అని ప్రశ్నిస్తూ, పెడబొబ్బ పెట్టింది. దాంతో రౌడీహీరో అభిమానులు రంగంలోకి దిగిపోయారు. అమ్మడిని ఛెడామడా అడేసుకున్నారు. హరీష్ శంకర్ లాటి దర్శకుడు కూడా అనసూయ పోస్టుని వెక్కిరిస్తున్నట్టుగా వంద ది లు పెట్టి మరీ ట్వీట్ చేయడంతో రౌడీహీరో అభిమానులకు మరింత వత్తాసు దొరికినట్టయింది. అది కొన్నాళ్ళు ధారావాహికంగా నడించింది. అయినా అమ్మడు పెద్ద చలించలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందననట్టుగా అనసూయ తన పని తాను ఏమీ తెలియనట్టు చేసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఈ మథ్య మీడియాతో మాట్లడడానికే భయమేస్తోందని కొత్త రాగం అందుకుంది అమ్మడు.

తానొకటి మాట్లాడితే మీడియా దానిని వక్రీకరించి, చిలవలుపలవులుగా తనమీద విమర్శలు అల్లుతోందని పబ్లిక్ డయాస్ మీదనే పాపం విచారం వ్యక్తం చేసింది. ఇందు మూలముగా అమ్మడు తెలియజేయునది ఏమనగా ఎవరితోనూ మాట్లాడను అని పెద్దకాపు ఫంక్షన్ వేదికగా తెగేసి చెప్పేసింది. దాంతో సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పించారు. దీనికి కారణం లేకపోలేదు. అమ్మడు ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో గొప్ప యాక్టివ్. ఎటువంటి ఫోటో పోస్ట్ చేయడానికైనా వెనుకాడదు. ఇటువంటి ఫొటో పెడితే నెటిజన్లు రెచ్చిపోతారని కూడా సంశయించదు. భర్తతో హాలీడే ట్రిప్పులకి వెళ్ళినప్పుడు, అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఫొటోలు ఎలా ఉంటాయో తెల్సు కదా..ఆ ఫోటోలను సైతం పెట్టి కుర్రకారుని, పురుష పుంగవులను ఏకకాలంలో పిచ్చిలో ముంచెత్తుతుంది. ఇటువంటి ఫోటోలు తన డిగ్నిటీని ప్రశ్నిస్తాయి, దిగజారుడు కామెంట్లను ఎదుర్కొనవలసి వస్తుందన్న విచక్షణ కూడా అమ్మడి మైండ్ కి అందదు పాపం.

ఒక పక్కన యధేచ్ఛగా సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తూ, అమ్మో మీడియాతో మాట్లాడితే ఏం రాస్తారో అని మరోపక్క వణికిపోవడమేమిటి అని పరిశ్రమలో కొందరు పెద్ద దర్శకులే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. అమ్మడిని నేరుగా అడగలేక. మీడియా ఎప్పుడూ ఎవ్వరినీ అకారణంగా అనలేదు. ఎవ్వరి ప్రతిష్టను భంగం చేయడానికి పూనుకోలేదు. ప్రయత్నించలేదు. ఉన్నదానినే విమర్శించడమో, విశ్లేషించడమో కొండొకచో చిత్రికి పట్టడమో చేసింది తప్పితే పనిగట్టుకుని ఎవరి జోలికి ఎప్పడూ మీడియా అకారణంగా, అనవసరంగా, అసందర్భంగా పోలేదు. మరి ఇది అమ్మడికి ఎందుకు అర్ధం కాలేదో ఏ మాత్రం అర్ధం కాదు. నువ్వు ప్రయివేటుగా ఉన్నప్పడు మేము ఏమీ అనం. పబ్లిక్ వస్తే మాత్రం అంటాం..టాంటాం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు అనసూయ అమ్మడు చదివినట్టు లేదు.