iDreamPost

వీడియో వైరల్: కల్కి బుజ్జితో ఆనంద్ మహీంద్ర

  • Published Jun 12, 2024 | 5:59 PMUpdated Jun 12, 2024 | 5:59 PM

గత కొన్ని రోజులుగా ప్రభాస్ కల్కి సినిమాలో బుజ్జి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుజ్జితో ఆనంద్ మహీంద్రా ఉన్న వీడియో మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గత కొన్ని రోజులుగా ప్రభాస్ కల్కి సినిమాలో బుజ్జి సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బుజ్జితో ఆనంద్ మహీంద్రా ఉన్న వీడియో మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published Jun 12, 2024 | 5:59 PMUpdated Jun 12, 2024 | 5:59 PM
వీడియో వైరల్: కల్కి బుజ్జితో ఆనంద్ మహీంద్ర

ఇప్పుడు అందరూ ఎంతో ఆత్రుతగాగా ఎదురుచూస్తున్నా సినిమా కల్కి 2898 ఏడీ. ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈసినిమాను డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైల్డ్ గా భారీ అంచనాలు పేరిగిపోయాయి. ఇక ఈ సినిమా గురించి డార్లింగ్ అభిమానులైతే వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్,ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈ సినిమా ఈనెల అనగా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే..ఈ కల్కి సినిమాలో భైరవ బుజ్జిని మూవీ మేకర్స్ ఇటీవలే పరిచయం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ బుజ్జీ కోసం భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. అయితే తాజాగా ఈ బుజ్జి వాహనంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంత మహేంద్ర ఉన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బుజ్జీ ఎంతలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ లుక్‏లో స్టైలీష్ గా ఉన్న బుజ్జిని చూసి డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా ఫిదా అయ్యారు. పైగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మూవీ టీమ్ ప్రమోషన్స్ ను జోరుగా పెంచింది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లో బుజ్జిని తిప్పుతూ ప్రచారాలు చేస్తున్నారు. కాగా, ఇందులో భాగంగానే బుజ్జి వాహనాన్ని ఆనంద్‌ మహీంద్రా డ్రైవ్‌ చేశారు. కాగా, ఈ వీడియోను ‘బుజ్జి మీట్స్‌ ఆనంద్‌ మహీంద్రా’ అనే క్యాప్షన్‌తో నిర్మాణసంస్థ షేర్‌ చేసింది.

ఇక ఆనంద్ మహింద్రా డ్రైవ్ చేసిన ఆనంతరం బుజ్జితో ఫోటోలు దిగారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ కల్కి మూవీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, ఆయన టీమ్‌ ‘బుజ్జి’ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఇందుకోసం వందల స్కెచ్‌లు వేశారు. అలాగే కారు రూపు రేఖలు ఇవ్వడానికి ఏకంగా ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లను చదవాల్సి వచ్చిందని నాగ్‌ అశ్విన్‌ ఇటీవలే చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఈ కారును దాని రూపంలోకి తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలైన మహీంద్రా, జయం మోటార్స్‌ (కోయంబత్తూరు) ఇంజినీర్లు సహకారం అందించారు.

అయితే గతంలో కూడా నాగ్ అశ్విన్ పై ఆనంద్‌ మహీంద్ర ఇటీవల ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన అద్భుతమని ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. అలాగే వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారుచేయడంలో ‘కల్కి’ చిత్ర బృందానికి చెన్నైలోని ‘మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ’ టీమ్‌ సహాయపడింది. ‘బుజ్జి’ వాహనం రెండు మహీంద్రా ఇ-మోటార్లతో నడుస్తుంది’’ అని తెలిపారు.  ఇకపోతే ఈ కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి