iDreamPost
android-app
ios-app

ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎట్లా : రష్మిక

  • Published May 28, 2024 | 11:09 AM Updated Updated May 28, 2024 | 11:09 AM

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నుండి రాబోతున్న సినిమా గం గం గణేశ. మే 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నుండి రాబోతున్న సినిమా గం గం గణేశ. మే 31న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.

  • Published May 28, 2024 | 11:09 AMUpdated May 28, 2024 | 11:09 AM
ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎట్లా : రష్మిక

బేబి మూవీతో హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ నుండి వస్తున్న నెక్ట్స్ చిత్రం గం గం గణేశా. యాక్షన్ అండ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ బాణీలు సమకూరుస్తున్నాడు. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న గెస్ట్‌గా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంది రష్మిక.

కాగా, ఆనంద్ బ్రదర్ విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో నడుస్తుందంటూ ఎప్పటి నుండో రూమర్లు వస్తున్న సంగతి విదితమే. అలాగే గతంలో కూడా ఆనంద్ బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సైతం రష్మిక వచ్చింది. ఇప్పుడు గం గం గణేశా వేడుకకు కూడా హాజరైంది. ఈ సందర్భంగా రష్మికను కొన్ని ప్రశ్నలు వేశాడు ఆనంద్. ఆమె సరదాగా సమాధానాలిచ్చింది. ఇటీవల రష్మిక పలు పెట్ డాగ్స్, క్యాట్స్‌తో ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. వీటిపై ప్రశ్నలు అడగ్గా.. రష్మిక పెట్ డాగ్ ఆరా.. తన ఫస్ట్ బేబీ అని, విజయ్ దేవరకొండ పెట్ డాగ్ తన సెకండ్ బేబీ అంటూ చెప్పుకొచ్చింది. మీకిష్టమైన ట్రావెల్ ప్లేస్ ఏంటీ అడగ్గా వియత్నాం అని చెప్పింది నేషనల్ క్రష్. ఆ తర్వాత మరో ఇంట్రస్టింగ్ క్వశ్చన్ సంధించడంతో సందిగ్ధంలో పడిపోయింది ఈ కన్నడ కస్తూరి.

మీరు మంచి సినిమాలు చేశారు కదా.. మీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అని అడగ్గానే.. నీ యబ్బ అని సరదాగా తిట్టి..వెంటనే మైక్‌లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్‌లో పెడితే ఎట్లా’ అని సరదాగా తిట్టింది. రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) అని చెప్పింది. కేకలు, అరుపులతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. ఇక ఆనంద్ తన టూటూ గురించి కూడా ప్రస్తావిస్తూ… తాను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి.. శ్రీవల్లి అనే పేరు వేయించుకున్నా అని చెబుతాడు. అలాగే మరో కొన్ని ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఫన్నీగా సాగిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2లో నటిస్తున్న సంగతి విదితమే. రెయిన్ బో, ద గర్ల్ ఫ్రెండ్, చావా, కుబేరా వంటి చిత్రాలు చేస్తుంది రష్మిక.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet