Krishna Kowshik
తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంతలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి విదితమే. సురేఖ వ్యాఖ్యలపై గతంలోనే స్పందించింది చిల్ బులి. తాజాగా మరోసారి ఆమెకు ప్రశ్న ఎదురు కాగా,..
తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంతలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి విదితమే. సురేఖ వ్యాఖ్యలపై గతంలోనే స్పందించింది చిల్ బులి. తాజాగా మరోసారి ఆమెకు ప్రశ్న ఎదురు కాగా,..
Krishna Kowshik
అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, స్టార్ హీరోయిన్ సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దూమారం రేపాయి. సమంత, నాగ చైతన్య విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏక తాటిపై ఖండించింది సినీ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరూ మద్దుతుగా నిలిచారు. పాలిటిక్స్ కోసం సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ హితవు పలికారు. దిగజారుడు రాజకీయాలు చేయొద్దని సూచించారు. సురేఖకు నాగార్జున ఫ్యామిలీ, సమంత ఘాటుగా రిప్లై ఇచ్చారు. గొడవ పెద్దది కావడంతో కొండా సురేఖ క్షమాపణలు చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు కింగ్ నాగార్జున. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఇదిలా ఉంటే మరోసారి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సామ్.
వరుణ్ ధావన్, సమంత నటించిన సీటాడెల్ హనీ- బన్నీ వెస్ సిరీస్ త్వరలో ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లలో పాల్గొంటోంది ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈ సందర్భంగా ఆమెకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించారు సామ్. ‘ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఇక్కడ కూర్చోవడానికి ప్రధాన కారణం అభిమానులతో పాటు ఎంతోమంది నాకు మద్దతుగా నిలవడం. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో ఆ మద్దతు నాకెంతో సహాయపడింది. వారే నా పక్షాన నిలబడకపోయి ఉంటే.. క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నేను వాటిని వదులుకోవాలని కూడా భావించేదాన్నేమో. గతంలోనైనా, ఇటీవల జరిగిన విషయాలపైనైనా నా చుట్టూ ఉన్నవారి నమ్మకంతోనే సమస్యలను ఎదుర్కోగలిగాను’ అని హుందాగా సమాధానం ఇచ్చింది సమంత.
అలాగే సోషల్ మీడియా వేదికగా వస్తున్న ట్రోలింగ్స్ పై కూడా రియాక్ట్ అయ్యింది ఈ పాన్ ఇండియన్ బ్యూటీ. ట్రోలింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచించనని, ద్వేషంతో కూడిన సందేశాలను మనస్సుకు తీసుకోనని వెల్లడించింది. వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని పేర్కొంది. వీటి వల్ల తానెంతో బాధపడ్డానో.. వాళ్లు కూడా దీనికి బాధితులయ్యారేమో కదా అని ఆలోచిస్తానని .. చెడు చేసేవారి గురించి కూడా పాజిటివ్‌గా స్పందించింది సామ్. ఇక సామ్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ విషయానికి వస్తే.. చాలా రోజుల తర్వాత సమంత ఓటీటీ వేదికగా అభిమానులను పలకరించబోతుంది ఈ స్టార్ హీరోయిన్. రాజ్, డీకే దర్శకులు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇరగదీసినట్లు ఇటీవల విడుదలైన ట్రయిలర్‌లో అర్థమౌతుంది. ఇందులో ఓ తల్లికి బిడ్డగా కనిపించబోతుంది ఈ చిల్ బులి. నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరీ ఈ సిరీస్ సినీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.