iDreamPost
android-app
ios-app

Allu Arjun: నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం.. వైరలవుతున్న బన్నీ ట్వీట్!

  • Published Jan 12, 2024 | 7:44 PM Updated Updated Jan 12, 2024 | 7:44 PM

నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jan 12, 2024 | 7:44 PMUpdated Jan 12, 2024 | 7:44 PM
Allu Arjun: నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం.. వైరలవుతున్న బన్నీ ట్వీట్!

అల్లు అర్జున్.. టాలీవుడ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక గతేడాది పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు నెలకొల్పాడు బన్నీ. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో అల్లు అర్జున్ కాస్త బన్నీపేరుతో స్థిరపడ్డాడు. అయితే అతడి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మాత్రం 2007లో వచ్చిన ‘దేశముదురు’ అనే చెప్పాలి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ 2007లో సరిగ్గా ఇదే రోజు రిలీజైంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమాతోనే ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ చూపెట్టిన హీరోగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందెన్నడూ ఏ హీరో కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. కాగా.. దేశముదురు మూవీ వచ్చి నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు.

“నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. దేశముదురు చిత్రం విడుదలై ఈ రోజుతో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య, మూవీ యూనిట్ కు నా స్పెషల్ థ్యాంక్స్. నా సినిమా కెరీర్ లో మర్చిపోలేని విజయం అందించిన ఫ్యాన్స్ కు, ప్రేక్షకులను ధన్యవాదాలు” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో.. అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు బన్నీ.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş