iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్ నుండి స్పెషల్ అప్డేట్ వచ్చేసింది! ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్!

  • Author ajaykrishna Published - 11:15 AM, Wed - 30 August 23
  • Author ajaykrishna Published - 11:15 AM, Wed - 30 August 23
అల్లు అర్జున్ నుండి స్పెషల్ అప్డేట్ వచ్చేసింది! ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి స్పెషల్ అప్డేట్ అని తెలిసి ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఇన్ స్టాగ్రామ్ టీమ్ బన్నీని కలిసి స్పెషల్ షూట్ జరుపుతుందని.. ఎలాంటి అప్డేట్ ఇస్తారోనని చూశారు. మొత్తానికి ఫ్యాన్స్ వెయిటింగ్ కి సమాధానం వీడియో రూపంలో రానే వచ్చింది. అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ.. బన్నీ ఇన్ స్టాగ్రామ్ టీమ్ తో కలిసి చేసిన స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బన్నీ.. తాను నిద్ర లేచినప్పటి నుండి ఏమేం చేస్తాడో.. తన దినచర్య ఎలా ఉంటుందో చెబుతూ చూపించాడు. అలాగే తాను ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ సెట్ కి ఎలా వెళ్తాడో.. వెళ్ళాక పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం మేకోవర్ ఎలా అవుతాడో పూర్తిగా తన టీమ్ తో సహా చూపించడం జరిగింది.

ఇక బన్నీ తన గురించి చెబుతూనే.. కెరీర్.. ఫ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు. పుష్ప తనకెంతో స్పెషల్ అని చెప్పిన బన్నీ.. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ని మరింత గర్వపడేలా చేస్తానని తెలిపాడు. ప్రపంచంలో వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఫ్యాన్స్ చూపించే ప్రేమ వేరుగా ఉంటుంది. వాళ్ల ప్రేమను వర్ణించడం కష్టం. రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుందని తెలిసి నాకోసం చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. వాళ్ల అభిమానం, ప్రేమే నన్ను సరిహద్దులు దాటేలా చేస్తున్నాయి. పుష్ప 2 నా కెరీర్ లో 20వ సినిమా. పుష్పరాజ్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ దేనికి వెనకడుగు వేయద అంటూ చెప్పాడు బన్నీ.

అదే వీడియోలో పుష్ప షూటింగ్ సెట్ తో పాటు డైరెక్టర్ సుకుమార్, పుష్ప సినిమాటోగ్రాఫర్ లను సైతం చూపించడం జరిగింది. సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప 2 ఎంతో స్పెషల్ అని, ప్రస్తుతం షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ స్పెషల్ వీడియోలో బన్నీ మేకోవర్ హైలైట్ గా నిలుస్తుంది. ఇదిలా ఉండగా.. 2021లో విడుదలైన పుష్ప సినిమాకు.. పుష్ప 2 సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. మరి బన్నీ స్పెషల్ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Instagram (@instagram)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet