iDreamPost
android-app
ios-app

రేపు అభిమానుల కోసం బిగ్ సర్​ప్రైజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్!

  • Author singhj Published - 07:45 PM, Tue - 29 August 23
  • Author singhj Published - 07:45 PM, Tue - 29 August 23
రేపు అభిమానుల కోసం బిగ్ సర్​ప్రైజ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్!

టాలీవుడ్​కు అందని ద్రాక్షగా మారిన నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో అద్భుతమైన నటనకు గానూ ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యారు బన్నీ. 69 ఏళ్ల జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొట్టతొలి తెలుగు నటుడిగా నిలిచి ఆయన రికార్డు సృష్టించారు. మహామహులకు కూడా సాధ్యం కాని ఈ పురస్కారాన్ని గెలుచుకోవడంతో అంతటా అల్లు అర్జున్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్​కు సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు. టాలీవుడ్ మీసం మెలేశారని, ఇది కదా సక్సెస్ అంటూ ఆయన్ను మెచ్చుకుంటున్నారు. బండారు దత్తాత్రేయ లాంటి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బన్నీని నేరుగా కలసి అభినందనలు తెలియజేయడం విశేషం. ఇలా ఒక్క పురస్కారంతో దేశం మొత్తం మరోమారు తన గురించి మాట్లాడుకునేలా చేశారు అల్లు అర్జున్. అలాంటి ఆయన తన అభిమానుల కోసం బిగ్ సర్​ప్రైజ్​ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రేపు (ఆగస్టు 30వ తేదీ) ఉదయం 9 గంటలకు ఆ సర్​ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తానంటూ అల్లు అర్జున్​ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

Big surprise for bunny fans tomorrow! 2

బన్నీ పెట్టిన పోస్టు క్షణాల్లో వైరల్​గా మారింది. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ గురించి ఏమైనా అప్​డేట్ ఇస్తున్నారా? లేదా తర్వాతి చిత్రం గురించి ఏమైనా చెబుతారా? అంటూ ఈ పోస్టు గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. ఆ పోస్టు దేని గురించో తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాల్సిందే! ఇక, ‘పుష్ప’ చిత్రం గురించి తాజాగా బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మారుమూల ప్రాంతానికి చెందిన కథను తాము తీయాలనుకున్నామని.. తమ ప్రయత్నం, నిజాయితీ ఫలించిందని ఆయన అన్నారు. తాము ఇతరుల విధానాలను ఫాలో అవ్వడం లేదని.. అందరి దృష్టిని ఆకర్షించేలా ‘పుష్ప 2’ను తీస్తున్నామని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఇది లోకల్ సినిమా గ్లోబల్​గా మారేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి