iDreamPost
android-app
ios-app

Allu Arjun: పుష్ప తో అల్లు అర్జున్ రేంజే కాదు.. రెమ్యునిరేషన్ కూడా పెరిగిపోయింది!

  • Published Apr 26, 2024 | 4:17 PM Updated Updated Apr 26, 2024 | 4:17 PM

ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీస్ అంతా కూడా రెమ్యునిరేషన్స్ ను పెంచేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు చేరగా.. తాజాగా ఇప్పుడు బన్నీ కూడా యాడ్ అయ్యాడు. ఇంతకీ బన్నీ ఎంత రెమ్యునిరేషన్ ను పెంచేశాడో చూసేద్దాం.

ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీస్ అంతా కూడా రెమ్యునిరేషన్స్ ను పెంచేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు చేరగా.. తాజాగా ఇప్పుడు బన్నీ కూడా యాడ్ అయ్యాడు. ఇంతకీ బన్నీ ఎంత రెమ్యునిరేషన్ ను పెంచేశాడో చూసేద్దాం.

  • Published Apr 26, 2024 | 4:17 PMUpdated Apr 26, 2024 | 4:17 PM
Allu Arjun: పుష్ప తో అల్లు అర్జున్ రేంజే కాదు..  రెమ్యునిరేషన్ కూడా పెరిగిపోయింది!

సినిమా ఇండస్ట్రీ కి రావడం అంటేనే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇక్కడ ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అలానే.. కొన్ని సినిమాలు చేసి సైలెంట్ అయిపోయిన హీరోలు , హీరోయిన్లు ఉన్నారు. సినీ ఇండస్ట్రీకి వారు వస్తున్నారు అంటే వారు ఇక్కడ నిలదొక్కుకోడానికి వారి కష్టం ఎంత అవసరమో. అదృష్టం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో కొన్ని సినిమాలు వారికి ఓవర్ నైట్ లో స్టార్ డమ్ ను తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇక వారి స్థాయి మారుతున్న కొద్దీ.. వారి రెమ్యునిరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో రెమ్యునిరేషన్స్ పెంచేసిన హీరోలు, హీరోయిన్లు గురించి అడపా దడపా వింటూనే ఉంటున్నాం. ఇక ఇప్పుడు ఈ జాబితాలో బన్నీ పేరు కూడా చేరిపోయింది. మరి ఇంతకీ బన్నీ తన రెమ్యునిరేషన్ ను ఇంతకు పెంచేశాడో చూసేద్దాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలను అందిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు బన్నీ కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నా కానీ.. అవన్నీ ఒక ఎత్తైతే.. పుష్ప సినిమా మరొక ఎత్తు. నిజానికి పుష్ప సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్ లోనే చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పి తీరాలి. ఎటువంటి అంచనాలు లేకుండా పుష్ప పార్ట్ -1 రిలీజ్ చేసినపుడు.. దానికి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దీనితో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో ఇప్పుడు.. పుష్ప పార్ట్-2 ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు తన రెమ్యునిరేషన్ పెంచేశాడట బన్నీ. మొదటి పార్ట్ కు రూ.100 కోట్లు వరకు తీసుకోగా.. రెండవ పార్ట్ కు ఏకంగా రూ.150 కోట్లు అందుకోబోతున్నట్లు ఇన్సైడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునిరేషన్ అందుకున్న నటుల్లో ఒకడిగా బన్నీ రికార్డు క్రియేట్ చేసినట్లే.

ఇక పుష్ప -2 సినిమా విషయానికొస్తే.. ఒక్కొక్కటిగా ఈ సినిమా నుంచి వస్తున్న అప్ డేట్స్ అన్నీ కూడా.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమా ఓటీటీ డేట్ కూడా క్లోజ్ అయిందని.. సుమారు రూ.275 కోట్ల వరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్లే సమాచారం. పుష్ప -2 సినిమాపైన ప్రేక్షకులు పెంచుకుంటున్న అంచనాలకు ఏ మాత్రం తక్కువ చేయకుండా.. అంచనాలకు మించి ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు అందరి ఎదురు చూపులు ఈ సినిమాపైనే ఉన్నాయి. మరి, అల్లు అర్జున్ తన రెమ్యునిరేషన్ పెంచేశాడు అని వినిపిస్తున్న టాక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş