iDreamPost
android-app
ios-app

బర్త్ డే రోజు రెండు చిక్కు ముడులు విప్పనున్న ఐకాన్ స్టార్!

  • Published Mar 15, 2024 | 10:10 PM Updated Updated Mar 15, 2024 | 10:10 PM

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఆగస్టు 15న తప్పకుండా వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రూమర్స్ కి సంబంధించి బన్నీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Icon Star Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఆగస్టు 15న తప్పకుండా వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రూమర్స్ కి సంబంధించి బన్నీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

  • Published Mar 15, 2024 | 10:10 PMUpdated Mar 15, 2024 | 10:10 PM
బర్త్ డే రోజు రెండు చిక్కు ముడులు విప్పనున్న ఐకాన్ స్టార్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన క్రేజ్ ని పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తన నటన, స్టైల్, హుందాతనం, సినిమాలతో ఎంతో గొప్ప అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ కాన్సన్ ట్రేషన్ మొత్తం పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత మరో ప్రాజెక్ట్ చేసేది అని ఫిక్స్ అయిపోయాడు. పైగా ఇది రెండో భాగంతో ఆగిపోయేది కూడా కాదు అని చెప్పారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ కి సంబంధించి రెండు పుకార్లు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటికి సంబంధించి క్లారిటీ రావాలి అంటే కాస్త ఆగాల్సిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా ప్రేక్షకులు కూడా ఏప్రిల్ 8 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకు అంటే ఆ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. ఆ రోజు బన్నీ ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న రెండు పుకార్లకు చెక్ పడే ఆస్కారం ఉంది. ఒకటి ఏంటంటే పుష్ప 2 సినిమా వాయిదా పడబోతోంది. నిజానికి మేకర్స్ గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా ఆగస్టు 15కి వస్తుంది అంటూ నొక్కి చెప్తున్నారు. కానీ, పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈసారి బన్నీ పుట్టినరోజుకి పుష్ప 2 సినిమాకి సంబంధించి టీజర్ వస్తుంది అంటున్నారు. ఆ టీజర్ తో పాటుగా రిలీజ్ డేట్ కి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది అంటున్నారు. అందుకే బన్నీ బర్త్ డే కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Bunny

పుష్ప 2 సినిమాపై పాన్ వరల్డ్ లెవల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. అందుకే అవి కేవలం పుకార్లు మాత్రమే అవ్వాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు. అలాగే రెండో పుకారు ఏంటంటే.. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించింది. ఒకరు త్రివిక్రమ్ కాంబోలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అంటున్నారు. మరికొందరు అట్లీ డైరెక్షన్ లో ఏ6 ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ చేయబోతున్నాడు అంటున్నారు. చాలామంది అట్లీ డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ నటించబోతున్నాడని చెప్తున్నారు.

ఇప్పటికే అట్లీ టీమ్ డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసింది. కాన్సెప్ట్ వీడియో లేదా పోస్టర్ రిలీజ్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తోనా.. అట్లీతోనా అనే విషయం తెలియాలి అన్నా కూడా ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఎవరి ప్రాజెక్ట్ ఫైనల్ అయితే వారి నుంచి కచ్చితంగా అల్లు అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఏదో ఒక అప్ డేట్ ని ఇస్తారు. కాబట్టి ఈ పుట్టిన రోజుకు బన్నీకి సంబంధించిన రెండు చిక్కు ముడులకు సంబంధించి క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇంక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

Bunny

ఇప్పుడు పుష్పరాజ్ రేంజ్ ఏపీ నుంచి జపాన్ దాకా వెళ్లబోతోంది అంటున్నారు. పార్ట్ 2లో విలన్స్ అంతర్జాతీయ లెవల్లో ఉంటారు అంటున్నారు. అలాగే స్టార్ కాస్ట్ కూడా పెరగబోతోందని టాక్ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15కి రిలీజ్ చేయాలని రెండు టీమ్స్ ని పెట్టి వర్క్ చేస్తున్నారంట. మరోవైపు పుష్ప కథ రెండు పార్టులతో ఆగేది కాదు అని స్వయంగా అల్లు అర్జున్ అంతర్జాతీయ వేదికపై వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని ఒక ఫ్రాంచైజ్ చేయబోతున్నాం అంటూ బన్నీ ప్రకటించాడు. మరి.. ఈ కథతో ఇంకా ఎన్ని సినిమాలు వస్తాయో చూడాలి. మరి.. బన్నీ బర్త్ డే కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio