iDreamPost
android-app
ios-app

అల్లు అర్జున్‌ ఎమోషనల్‌.. ‘నాకు జాతీయ అవార్డు రావాలని ఆయన బలంగా కోరుకున్నారు’

  • Published Oct 22, 2023 | 3:37 PM Updated Updated Nov 03, 2023 | 11:57 AM

పుష్ప చిత్రానికి గాను.. అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

పుష్ప చిత్రానికి గాను.. అల్లు అర్జున్‌ జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Oct 22, 2023 | 3:37 PMUpdated Nov 03, 2023 | 11:57 AM
అల్లు అర్జున్‌ ఎమోషనల్‌.. ‘నాకు జాతీయ అవార్డు రావాలని ఆయన బలంగా కోరుకున్నారు’

గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నేడు జాతీయ స్థాయి ఉత్తమ హీరోగా నిలిచాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడమే కాక.. అదే సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్‌. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు.. తెలుగు పరిశ్రమ నుంచి జాతీయ అవార్డు సాధించిన వాళ్ల కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనకు అవార్డు రావాలని ఇక వ్యక్తి ఎంతో బలంగా కోరుకున్నారు అంటూ అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

తన మిత్రుడు దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు అల్లు అర్జున్‌. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ..‘‘బాలీవుడ్‌కి వెళ్లమని ఈ 20 ఏళ్లల్లో దేవిశ్రీ ప్రసాద్‌కు ఎన్నో సార్లు చెప్పాను. కాన తను ప్రతిసారి ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు నేను వస్తాను అనేవాడు. ఆ మాటలు విని.. నాతో ఎక్కడ అవుతుంది అనుకునేవాడిని. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాము. అక్కడ మంచి విజయం అందుకున్నాం. 20 ఏళ్లుగా దేవితో అంటున్న మాట.. ఇలా నిజమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించిన నాడు మా నాన్న ఎంతో సంతోషపడ్డాడు. నా ఇద్దరు కొడుకులకు జాతీయ అవార్డు వచ్చినట్లు ఉందన్నారు’’ అని చెప్పుకొచ్చాడు.

అంతేకాక ‘‘జీవితంలోని ప్రతి దశలో నేను ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని అందరూ చెబుతారు. అయితే జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు ఒక విషయం అర్థం అయ్యింది. మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే అది జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ నాకు అవార్డు రావాలని సుకుమార్ నాకన్నా ఎక్కువగా కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయనే అచీవర్‌.. నేను కేవలం అచీవ్‌మెంట్‌ మాత్రమే’’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss