Arjun Suravaram
Allu Arjun Wayanad landslide: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నారు. కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఆ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
Allu Arjun Wayanad landslide: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నారు. కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఆ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
Arjun Suravaram
కేరళలో వరదలు సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఊర్లు మెుత్తం చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 300కి పైగా మంది మృతిచెందారు. అంతేకాక వందల మంది గల్లంతయ్యారు. వయనాడ్ ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ భారీ విపత్తు వేళ సౌత్ ఇండియాలోని సినీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ గొప్ప మనసును చాటుకుంటూ భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కేరళ ప్రజలకు తనవంతుగా సాయం అందించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గొప్ప మనసు చాటుకున్నారు. కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఆ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. అదే విధంగా తన వంతుగా అక్కడి ప్రభుత్వానికి సాయం అందించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాక వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సోషల్ మీడియా ద్వారా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాక వయనాడ్ వరదల ఘటన తనని కలచి వేసిందని తెలిపారు.
కేరళ ప్రజలు తనని ఎంతో అభిమానించారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసింది. అక్కడి ప్రేక్షకులు ఆయన్ని ప్రేమగా మల్లుఅర్జున్ అని పిలుస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల తరువాత బన్నీకి ఎక్కువగా ఫ్యాన్స్ కేరళలోనే ఉన్నారు. అల్లు అర్జున్ మూవీలు అక్కడ భారీగా కలెక్షన్లు సాధిస్తాయి. ఇది ఇలా ఉంటే.. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈగర్ గా చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. వయనాడ్ వరద బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్ హీరో సూర్య దంపతులు, ఆయన సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు ఇచ్చారు. అలానే నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు. మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు అందజేశారు. మరోవైపు నటుడు మోహన్‌లాల్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.