nagidream
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హడావుడి నడుస్తోంది.ఆయా పార్టీలన్నీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమేనా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హడావుడి నడుస్తోంది.ఆయా పార్టీలన్నీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమేనా?
nagidream
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకొన్ని రోజుల్లో ఏపీలో సాధారణ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారంటూ ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ కూడా ఈ వీడియోని షేర్ చేయడంతో చాలా మంది ఇది నిజమని నమ్మేశారు. ఆ తర్వాత ఇంకొంతమంది అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారంటూ హిందీలో ఓ వీడియో షేర్ చేశారు. ఇలా ఎవరికి వారు నిజమో కాదో అని నిర్ధారించుకోకుండా అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని వీడియో షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఇందులో నిజమెంత అన్నది ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
ఇప్పటి వీడియో కాదది. ఆ వీడియో 2022లో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొన్న వీడియోగా బూమ్ సంస్థ నిర్ధారించింది. బూమ్ సంస్థ ఈ వీడియోని రివర్స్ సెర్చ్ ద్వారా గమనిస్తే.. అల్లు అర్జున్ పరేడ్ లో పాల్గొన్నట్టు ఆర్టికల్స్, ఫోటోస్ కనిపించాయి. పలు జాతీయ మీడియా వెబ్ సైట్స్ లో కూడా అల్లు అర్జున్ పాల్గొన్న విషయం గురించి రాసుకొచ్చాయి. మరింత లోతుగా సెర్చ్ చేస్తే.. ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోని 2022వ సంవత్సరం ఆగస్టు 23న అప్లోడ్ చేశారు. డిస్క్రిప్షన్ లో.. ‘న్యూయార్క్ లో జరిగిన 40వ ఇండియా డే పరేడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్’ అని ఉంది. ఒరిజినల్ వీడియో గమనిస్తే.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని క్లియర్ గా అర్థమవుతుంది. 2022 ఆగస్టు 22న అల్లు అర్జున్ పరేడ్ కి సంబంధించిన ఈవెంట్ ని జాతీయ మీడియా కవర్ చేసింది.
భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ యాన్యువల్ ఇండియా డే పరేడ్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ న్యూయార్క్ నగర మేయర్ ని కూడా కలిశారు. కాబట్టి అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారంటూ వైరల్ అవుతున్న వీడియో ఫేక్. ఈ ఫేక్ వీడియో కనుక మీ కంట్లో పడితే వెంటనే రిపోర్ట్ కొట్టండి. ఫేక్ వీడియోనే కదా ఏమవుతుంది అనుకోకండి. అల్లు అర్జున్ లాంటి వ్యక్తే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కదా అని నిజమని నమ్మి అమాయకులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. ఓటు వేసేవారిని ప్రభావితం చేయకూడదు. అది నేరం. కాబట్టి ఈ ఫేక్ వీడియోని తిప్పికొట్టేలా ఈ కథనాన్ని షేర్ చేయండి. అలానే ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Allu Arjun the biggest super star of India is campaigning for congress party. pic.twitter.com/rSErtscMnM
— KRK (@kamaalrkhan) April 20, 2024