Venkateswarlu
వాళ్లకు లైఫ్ సెట్ అవుద్ది.. దీన్నో గొప్ప ఇది కింద అనుకుని చేయటం లేదు. మేము మా ఉనికి కోసం...
వాళ్లకు లైఫ్ సెట్ అవుద్ది.. దీన్నో గొప్ప ఇది కింద అనుకుని చేయటం లేదు. మేము మా ఉనికి కోసం...
Venkateswarlu
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద సినిమాల నిర్మాణంపై తాజాగా స్పందించారు. నిర్మాణ వ్యయం వల్లే తాను పెద్ద సినిమాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. హీరోల వల్లే నిర్మాణ వ్యయం పెరుగుతోందన్న ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమా పెద్దగా తీస్తే పెద్దగా ఆడుతుందని అన్నారు. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కోటబొమ్మాలి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అల్లు అరవింద్ హాజరయ్యారు. టీజర్ లాంచ్ అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్.. మీరు పెద్ద సినిమాలు ఎందుకు చేయటం లేదు అని ప్రశ్నించాడు.
ఇందుకు అల్లు అరవింద్ సమాధానం ఇస్తూ.. ‘‘ పెద్ద సినిమాలు రెండు ఉన్నాయి. అవి అనేక కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఇండస్ట్రీని ఉద్దరించడానికి.. పోషించడానికి.. చిన్న సినిమాలు తీసి పోషించాలని ఏమీ లేదండి. మా బ్రతుకు బాటలో మేము వెళుతూ ఉంటే.. అది చాలా మందికి ఉపయోగపడుతోంది. గీతా ఆర్ట్స్‌నుంచి మిగితా వాళ్లకు అవకాశం ఇస్తే.. వాళ్లకు లైఫ్ సెట్ అవుద్ది.. దీన్నో గొప్ప ఇది కింద అనుకుని చేయటం లేదు. మేము మా ఉనికి కోసం సినిమాలు తీస్తున్నాము.. కాస్ట్ వల్లే పెద్ద సినిమాలు చేయటం లేదు.
పెరిగిన కాస్ట్‌లో హీరోలు 25 శాతం తీసుకుంటున్నారు. హీరోల వల్ల కాస్ట్ పెరగటం లేదు. కేజీఎఫ్ రాకముందు అతను(యశ్) ఎవరండి? ఎంత పెద్ద హీరో.. సినిమాను పెద్దగా తీసి.. పెద్దగా చూపించారు కాబట్టే.. ఒక ఉదాహరణగా చెబుతున్నా..’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, యశ్‌పై అల్లు అరవింద్ చేసిన కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.