iDreamPost
android-app
ios-app

కళ్ళ ముందే రవితేజ నష్టపోయాడు! అల్లరోడికి ఈ రిస్క్ అవసరమా?

  • Published Nov 20, 2023 | 1:27 PM Updated Updated Nov 20, 2023 | 1:27 PM

అల్లరి నరేష్‌ రవితేజ బాటలోనే ఓ రౌడీ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతానికి చెందిన ఓ రౌడీ పాత్రలో కనిపించబోతున్నారు..

అల్లరి నరేష్‌ రవితేజ బాటలోనే ఓ రౌడీ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతానికి చెందిన ఓ రౌడీ పాత్రలో కనిపించబోతున్నారు..

  • Published Nov 20, 2023 | 1:27 PMUpdated Nov 20, 2023 | 1:27 PM
కళ్ళ ముందే రవితేజ నష్టపోయాడు! అల్లరోడికి ఈ రిస్క్ అవసరమా?

మాస్‌ మహారాజా ‘రవితేజ’ తాజాగా ‘ టైగర్‌ నాగేశ్వరరావు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరులోని స్టువర్టుపురానికి చెందిన గజదొంగ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  అక్టోబర్‌ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యాన్‌ ఇండియా లెవెల్లో విడుదల అయిన ఈ సినిమాకు  ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అన్ని భాషల్లోనూ కలెక్షన్ల పరంగా కూడా సోసో అనిపించుకుంది. అలాంటి ఈ సమయంలో.. రవితేజ బాటలోనే హీరో అల్లరి నరేష్‌ కూడా ఓ రౌడీ బయోపిక్‌లో నటించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతానికి చెందిన బచ్చల మల్లి అనే రౌడీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లరి నరేష్‌ బచ్చల మల్లి పాత్రలో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్ర దర్శకుడు సుబ్బు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రాజేష్‌ దండా నిర్మాణ బాధ్యతల్ని చేపట్టనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. ‘బచ్చల మల్లి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. పూర్తి స్థాయి ఊర మాస్‌ లుక్‌లో అల్లరి నరేష్‌ కనిపించనున్నారట.

అల్లరి నరేష్‌ రిస్క్‌ తీసుకుంటున్నారా?

టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై విడుదలకు మందునుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. కానీ, సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రవితేజ సూపర్‌ పర్ఫార్మెన్స్‌ చేసినా లాభం లేకపోయింది. ఇలాంటి ఈ సమయంలో అల్లరి నరేష్‌ రవితేజ బాటలో రౌడీ బయోపిక్‌లో నటించటం రిస్కేనని అంటున్నారు సినీ విశ్లేషకులు. కళ్ల ముందే రవితేజ నష్టపోయినా.. అల్లరి నరేష్‌ బచ్చల మల్లి బయోపిక్‌ చేయటానికి సిద్ధపడ్డం సాహసమే అంటున్నారు. అల్లరి నరేష్‌ కామెడీ సినిమాలు మానేసి.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన 2021లో ‘నాంది’ అనే సినిమా చేశారు.

ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన నాంది అల్లరి నరేష్‌లో కొత్త ఆశల్ని నింపింది. కొత్త కథలను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. వరుసగా ప్రయోగాలకు పెద్ద పీట వేసే సినిమాలే చేస్తున్నారు. మొన్నీ మధ్య ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ‘సభకు నమస్కారం’ అనే సినిమాలో నటిస్తున్నారు.  ఆ ప్రయోగాల్లో భాగంగానే ‘ బచ్చల మల్లి’ సినిమా చేయటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రయోగాలు ప్రతీసారి మంచి ఫలితాల్ని ఇవ్వవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి, అల్లరి నరేష్‌ ‘బచ్చల మల్లి’ అనే రౌడీ బయోపిక్‌లో నటిస్తూ.. రిస్క్‌ తీసుకుంటున్నాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom