iDreamPost
android-app
ios-app

మహేష్ – రాజమౌళి సినిమాలో ఆలియా భట్?

  • Published Mar 25, 2024 | 9:04 PM Updated Updated Mar 25, 2024 | 9:04 PM

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Mar 25, 2024 | 9:04 PMUpdated Mar 25, 2024 | 9:04 PM
మహేష్ – రాజమౌళి సినిమాలో ఆలియా భట్?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒక భారీ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని మహేష్ అభిమానులతో పాటు ఇండియన్ సినిమా ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియాలోనే బిగ్గెస్ట్ సినిమాగా రానున్న ఈ సినిమా పై ఆ మాత్రం అంచనాలు ఉండడం అనేది సాధారణ విషయమే కదా. ఇక ఈ సినిమా కథతో పాటు నటీనటుల పై కూడా రోజురోజుకూ రూమర్స్ పెరిగిపోతున్నాయి. అదే క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ఓ కొత్త పుకారు బయటకు వచ్చింది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించగా గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ సరసన ఆలియా నటించిన సంగతి తెలిసిందే. మరి ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె SSMB29 లో నటిస్తే రాజమౌళితో వరుసగా ఇది రెండో సినిమా అవుతుంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి, ఆలియా భట్ ఒకరి పై ఒకరు పొగడ్తల వర్షం కురిపించారు. అలాంటిది ఇద్దరూ మళ్ళీ కలిసి పని చేస్తారనే ప్రచారం కాస్త నమ్మదగ్గదే అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

ఇక మహేష్ బాబు సరసన అలియా భట్ నటించడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. స్వతహాగా రాజమౌళి సినిమాలకు కథ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారే అందిస్తుంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి – మహేష్ కాంబినేషన్లో వచ్చే సినిమా గురించి అడిగినప్పుడు ఈ సినిమా ఆఫ్రికా నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుందని తెలిపారు. అదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజమౌళి, నేనూ సౌతాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్‌కి వీరాభిమానులం. అందుకే ఆయన పుస్తకం ఆధారంగా ఈ సినిమాకి స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. అయితే రాజమౌళి దృష్టి మాత్రం స్క్రిప్ట్ పైనే ఉంటుందన్నారు. రాజమౌళి సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడైన ఎమ్ ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీ అంచనాలతో రానున్న మహేష్ బాబు, రాజమౌళి మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి హైప్ నడుస్తుంది. ఇక ఆలియా భట్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే విషయం తెలియాలంటే అఫిషియల్ న్యూస్ వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇదికూడా చదవండి: బిగ్ బాస్ బ్యూటికి 14 రోజుల రిమాండ్ ఇచ్చిన కోర్టు!

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet