iDreamPost

బిగ్ బాస్ బ్యూటికి 14 రోజుల రిమాండ్ ఇచ్చిన కోర్టు!

అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో బిగ్ బాస్ గుర్తింపు పొందిన ఓ నటిని పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం ఆమెను అరెస్టు చేయగా..తాజాగా ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో బిగ్ బాస్ గుర్తింపు పొందిన ఓ నటిని పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం ఆమెను అరెస్టు చేయగా..తాజాగా ఆమెకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

బిగ్ బాస్ బ్యూటికి 14 రోజుల రిమాండ్ ఇచ్చిన కోర్టు!

నిత్యం ఎంతో మందికి విషయంలో కోర్టులు వివిధ రకాల తీర్పులు ఇస్తుంటాయి. అయితే అవేవి అంతగా సోషల్ మీడియాలో కానీ,మరే ఇతర మాధ్యామాల్లోగానీ ఎక్కువగా వైరల్ కావు. అయితే సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన విషయాలు అయితే తెగ వైరల్ అవుతుంటాయి. అలానే కోర్టులు కూడా సెలబ్రిటీలకు షాకిచ్చిన ఘటనలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా బిగ్ బాస్ బ్యూటీకి కోర్టు షాకిచ్చింది. ఆమెకు ఓ కేసు విషయంలో 14 రోజులు రిమాండ్ విధించింది. మరి.. ఆమె ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పిల్లలను దత్తత తీసుకున్న కేసులో కన్నడ బిగ్ బాస్ ఫేమ్, రీల్స్ స్టార్ సోనుగౌడను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  గత శుక్రవారం ఓ బిడ్డను అక్రమంగా దత్తతగా తీసుకున్నారనే ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.  సోనూ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ..తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని తెలిపింది. సుమారు 45 రోజుల క్రితం ఆ చిన్నారి ని తీసుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న బాలికను, తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకొని వచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఆ వివరాలనే పోలీసులకు తెలియజేసింది.

గత శుక్రవారం అరెస్టైన సోనుగౌడను ఆ సమయంలో 5 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. అయితే ఐదు రోజుల్లో పోలీస్ కస్టడీలో విచారణ పూర్తి కానందున మరింత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు. సోనూగౌడను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. సోనూగౌడ ఆ చిన్నారిని దత్తత తీసుకున్న తర్వాత అతడికి ఖరీదైన బహుమతి ఇచ్చానని ఆ పాపతో రీళ్లు చేయించి..పబ్లిసిటీ కూడా పొందిందని, అలానే దత్తత తీసుకున్న తరువాత నిబంధనలు పాటించలేదని తెలిసింది. అక్రమంగా బిడ్డను దత్త తీసుకుందనే అభియోగంపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ విచారణలో చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారా లేదా అన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

హిందూ దత్తత చట్టం-1956 ప్రకారం సోనుగౌడ్ పాపను దత్తత తీసుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై పోలీస్ కస్టడి కొనసాగింది. తాజాగా జ్యూడిషియల్ కస్టడికి బెంగళూరు సీజేఎం కోర్టు ఆదేశించింది. సోనూ గౌడను ఏప్రిల్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. తదుపరి కోర్టు విచారణలో, పిల్లలను దత్తత తీసుకునే హక్కును ఉల్లంఘించినందుకు కూడా జైలు శిక్షను ఎదుర్కోవచ్చుని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా తరచూ పలు కేసులతో కొందరు సెలబ్రిటీలు అరెస్టు అవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరి..తాజాగా ఈ కన్నడ బిగ్ బాస్ బ్యూటికి 14 రోజులు రిమాండ్ విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి