iDreamPost
android-app
ios-app

కన్నప్ప నుంచి మరో స్టార్‌ హీరో పోస్టర్‌ రిలీజ్‌!

  • Published Sep 09, 2024 | 12:14 PM Updated Updated Sep 09, 2024 | 12:32 PM

Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో స్టార్ నటి, నటులంతా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో స్టార్ హీరో పోస్టర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో స్టార్ నటి, నటులంతా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో స్టార్ హీరో పోస్టర్‌ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

  • Published Sep 09, 2024 | 12:14 PMUpdated Sep 09, 2024 | 12:32 PM
కన్నప్ప నుంచి మరో స్టార్‌ హీరో పోస్టర్‌ రిలీజ్‌!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జేట్ మూవీ కన్నప్ప. అయితే పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. పైగా ఈ మూవీలో ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి స్టార్ నటి,నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే కన్నప్ప నుంచి మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆడియోన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూస్తామనని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరీ అదేంటో చూద్దాం.

హీరో విష్ణు భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న కన్నప్ప మూవీ నుంచి తాజాగా  ఓ క్రేజీ అప్డేట్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అయితే కన్నప్ప మూవీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నరనే విషయం తెలిసిందే. అయితే నేడు ఆ స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా.. కన్నప్ప సినిమా నుంచి అక్షయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. కాగా, ఆ పోస్టర్ లో చేతికి రుద్రక్షి దండంతో.. ‘ముల్లకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అంటూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అలాగే ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ కు కన్నప్ప మూవీపై మరీంత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పవచ్చు. కానీ, అక్షయ్ ఫుల్ లుక్ కూడా రీవిల్ చేస్తుంటే బాగున్నని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో వైరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుందని ఇటీవలే మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటిస్తామని విష్ణు తెలిపారు. అయితే అదే నెలలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇకపోతే ముందుగా అనుకున్న దాని ప్రకారం కన్నప్ప మూవీ అదే నెలలో రిలీజ్ చేస్తారో, వాయిదా వేస్తారో చూడాల్సి ఉంది. మరీ, కన్నప్ప మూవీ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş