iDreamPost
android-app
ios-app

అక్షయ్ కుమార్ – ఇది అవమానమే

  • Published Jun 01, 2022 | 2:59 PM Updated Updated Jun 01, 2022 | 2:59 PM
అక్షయ్ కుమార్ – ఇది అవమానమే

Samrat Prithviraj ఎల్లుండి విడుదల కాబోతున్న సినిమాల్లో నార్త్ ట్రేడ్ బోలెడు ఆశలు పెట్టుకున్న సామ్రాట్ పృథ్విరాజ్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇలా జరగడం పట్ల అభిమానులు షాక్ ఆవుతున్నారు. మేజర్ కు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1.4 కోట్లు రాగా విక్రమ్ టాప్ పొజిషన్ లో 4.5 కోట్లతో బలంగా దూసుకుపోతోంది. ఎటొచ్చి తమిళ తెలుగు భాషల్లోనూ రిలీజవుతున్న పృథ్విరాజ్ మాత్రం 1.3 కోట్ల దగ్గరే ఉంది. ఇది చాలా తక్కువ. యష్ లాంటి పెద్ద బ్యానర్ మూవీకి ఇలా జరగడం అనూహ్యం. ఒకవేళ ఫస్ట్ డే డైరెక్ట్ ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయనుకున్నా అది కష్టమేనంటున్నారు ఎగ్జిబిటర్లు.

ఇలా ఎందుకు జరిగిందనే విశ్లేషణ చూస్తే పృథ్విరాజ్ పాత్రను ఒక వర్గానికి చెందిన వీరుడి కథగా ఉత్తరాది ప్రేక్షకులు భావించడంతో తర్వాత బాగుంటే చూద్దామనే ధోరణిలో అధిక శాతం ఉన్నారు. పైగా ఆయన గురించి దక్షిణాదిలో తెలిసింది తక్కువ. పోనీ ప్రమోషన్ల రూపంలో ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా అంటే అదీ జరగలేదు.అసలు ట్రైలర్ వచ్చినప్పుడే కంటెంట్ మీద అనుమానాలు వచ్చాయి. మానుషీ చిల్లర్, సోనూ సూద్ లాంటి క్యాస్టింగ్ ఉన్నప్పటికీ బజ్ ని పెంచడంలో అదేమాత్రం ఉపయోగపడలేదు. దానికి తోడు సోషల్ మీడియాలో దీని మీద కనీస ఆసక్తి కానీ చర్చ కానీ జరుగుతున్న దాఖలాలు లేవు. అందుకే పరిస్థితి ఇలా ఉంది

ఎక్కువ సినిమాలు చేయాలనే అక్షయ్ కుమార్ తాపత్రయం కూడా ఇలాంటి నెగెటివిటీకి దోహదం చేసింది. రీమేకులు, కంటెంట్ లేని కథలు ఎంచుకోవడం, డబ్బులు చేసుకోవడం తప్ప క్వాలిటీ మీద ఫోకస్ పెట్టకపోవడం లాంటివి తన మార్కెట్ ని ప్రభావితం చేశాయి. కౌంట్ ఉంటే సరిపోదు ఆడియన్స్ పల్స్ అర్థం చేసుకున్న టీమ్ కావాలనే సూత్రాన్ని మర్చిపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ తనను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే చాలా చిన్నవాడైన అడవి శేష్ ని సైతం అడ్వాన్స్ బుకింగ్స్ లో దాటలేకపోయాడు. పృథ్విరాజ్ కి టాక్ ఏ మాత్రం యావరేజ్ గా వచ్చినా భారీ నష్టాలు తప్పేలా లేవు. చూడాలి మరి.