iDreamPost
android-app
ios-app

Soorarai Pottru Hindi remake రీమేకుల వర్షంలో స్టార్ హీరో

  • Published Apr 25, 2022 | 4:55 PM Updated Updated Apr 25, 2022 | 4:55 PM
Soorarai Pottru Hindi remake రీమేకుల వర్షంలో స్టార్ హీరో

అదేంటో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు సౌత్ రీమేక్స్ ఫీవర్ పట్టుకుంది. వరుసబెట్టి మన హిట్టు సినిమాలను అక్కడ తెరకెక్కించే పనిలో యమా బిజీ అయిపోయారు. ఇటీవలే గద్దలకొండ గణేష్ (తమిళ ఒరిజినల్ జిగర్ తండా)ను హిందీలో బచ్చన్ పాండేగా చేస్తే అక్కడది మరీ ఘోరమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆల్రెడీ రాక్షసుడు రీమేక్ మిషన్ సిండెరిల్లా సెట్స్ మీద ఉంది. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆకాశం నీ హద్దురా(సూరారై పోట్రు) రీమేక్ ని అఫీషియల్ గా ప్రకటించారు. సూర్యనే హీరోగా స్వయంగా నిర్మించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ ఇప్పుడు హిందీలో కూడా రాబోతోంది. దీనికీ సూర్యనే ప్రొడ్యూసర్.

ఇప్పుడు హిందీలోనూ ఆయనే నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా సుధా కొంగరనే దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఇటీవలే కెజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ తనతో ఓ భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ సూర్యనే హీరో అని లీక్ ఉంది. ఇది మొదలయ్యేలోగా అక్షయ్ సినిమాను పూర్తి చేయొచ్చు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ నిజ జీవిత కథతో రూపొందిన ఆకాశం నీ హద్దురా ఓటిటిలో రిలీజైనప్పటికీ ఎన్నో గొప్ప ప్రశంసలు, అవార్డులు, రివార్డులు సంపాదించుకుంది. అదే ఫలితాన్ని అక్కడా ఆశిస్తున్నారు నిర్మాతలు సూర్య, జ్యోతికలు

అక్షయ్ కుమార్ ఇంతగా సౌత్ సినిమాల మీద పడిపోవడానికి కారణం లేకపోలేదు. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాల్లో, ఫ్లాప్ అయిన వాటిలో చాలా మటుకు ఇక్కడి నుంచి తీసుకున్నావ్. హాలిడే(తుపాకీ), భూల్ భులయ్య(చంద్రముఖి), గబ్బర్ ఈజ్ బ్యాక్(ఠాగూర్), లక్ష్మి(కాంచన), రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు) ఇలా చాలానే ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న సెల్ఫీ మలయాళం నుంచి తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్. స్ట్రెయిట్ మూవీస్ చేస్తున్నప్పటికీ ఏడాదికి ఎక్కువ సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో సగం రీమేకులు సగం స్ట్రెయిట్ సబ్జెక్ట్స్ చేస్తున్న అక్షయ్ కుమార్ కు సక్సెస్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలోనే దక్కుతుండటం విశేషం

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu