iDreamPost
android-app
ios-app

Akshay Kumar Gutkha Ad Dispute అక్షయ్ సారీ చెప్పాడు – నెక్స్ట్ ఎవరు

  • Published Apr 21, 2022 | 12:50 PM Updated Updated Apr 21, 2022 | 12:50 PM
Akshay Kumar Gutkha Ad Dispute అక్షయ్ సారీ చెప్పాడు – నెక్స్ట్ ఎవరు

రెమ్యునరేషన్లు భారీగా ముట్టజెబుతున్నారు కదాని సదరు వస్తువు జనానికి ఉపయోగపడేదో కాదో చూసుకోకుండా యాడ్స్ లో నటిస్తున్న సినిమా తారలకు జనం నుంచి గట్టి నిరసనలు ఎదురవుతున్నాయి. ఒకప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ తెలిసేది కాదు కానీ టెక్నాలజీ పుణ్యమాని సోషల్ మీడియా పెరిగాక నిలదీతలు ఎక్కువయ్యాయి. అలా అని స్టార్ హీరోలు తప్పించుకోవడానికి లేదు. మౌనంగా ఉంటే బ్యాడ్ పబ్లిసిటీ వైరల్ అయిపోయి అసలుకే మోసం తెస్తోంది. ఆ మధ్య అమీర్ ఖాన్ దేశం మీద చేసిన కామెంట్లకు అతన్ని బ్రాండ్ అంబాసడర్ గా ఉపయోగించుకునే స్నాప్ డీల్ గట్టి నష్టాన్నే చవి చూడాల్సి వచ్చింది. పబ్లిక్ తోని అట్లుంటది మరి.

ఇక తాజాగా అక్షయ్ కుమార్ తన తప్పును సరిదిద్దుకున్నాడు. విమల్ ఎలైచి పేరుతో పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేసినందుకు క్షమాపణ కోరుతూ అందులో నుంచి తప్పుకున్నాడు. అయితే లీగల్ అగ్రిమెంట్ ప్రకారం కాంటాక్ట్ ఉంటుంది కానీ అది పూర్తయ్యే వరకు యాడ్స్ వస్తుంటాయని ముందే చెప్పేశాడు. తన స్నేహితులు అభిమానులు ఇలాంటివి చేయడం మంచిది కాదని చెప్పాక నిర్ణయం మార్చుకున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి సారీనే చెప్పాల్సి వచ్చింది. చాలా ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ పెప్సీకి కొంత కాలం అంబాసడర్ గా చేశాక ఇది కరెక్ట్ కాదనిపించి వాటిని పూర్తిగా మానేశారు.

ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల మీద ఇప్పుడీ అక్షయ్ కుమార్ ఎపిసోడ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిజానికి ఈ టొబాకో కానీ ఇలాచీ కానీ స్టార్లు రోజూ వాడరు. కేవలం ఆ యాడ్ లో నటించేంత వరకే. అది కూడా తిని చూపించరు. మనల్ని మాత్రమే కొనమంటారు. అలాంటప్పుడు జనం ఆరోగ్యానికి సంబంధించిన వాటికి దూరంగా ఉండటమే మంచిది కదా. మహేష్ ఇప్పుడీ పరిణామాలను పట్టించుకుంటాడా లేదా అనేది చెప్పలేం కానీ మొత్తానికి ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది మంచిది కూడా. సినిమాల్లో ఇది తప్పని చెప్పే హీరోలు ఎవరైనా సరే నిజ జీవితంలోనూ దాన్ని పాటించాలిగా