P Krishna
Sitaram Sitralu Movie: ఇటీవల చిన్న సినిమాలకు స్టార్ హీరోలు ప్రత్యేక అతిధులుగా వెళ్తూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలనై తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే.
Sitaram Sitralu Movie: ఇటీవల చిన్న సినిమాలకు స్టార్ హీరోలు ప్రత్యేక అతిధులుగా వెళ్తూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాలనై తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే.
P Krishna
లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పి పార్థసారథి,డి నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా, డి నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో విభిన్నమైన కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా అందరిని అలరించే విధంగా రూపొందించిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. యంగ్ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా ‘సీతారాం సిత్రాలు’ ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్ సందర్భంగా హీరో ఆకాశ్ మాట్లాడుతూ.. సినిమా కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా తమ భుజాన వేసుకుంటారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు చిత్ర పరిశ్రమ వైపే చూస్తున్నాయి. సినిమా బాగుంటే కేవలం మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ విజయం అందిస్తారని అన్నారు. ఈ సినిమా కూడా అందరూ మెచ్చుకునే ఉంటుందని అన్నారు. చిన్న సినిమాలపై ప్రేక్షకులు ఎప్పటికీ మంచి ఆదరణ చూపించాలని కోరుకుంటున్నాని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు ఆకాశ్.
ఇక నిర్మాతలు డి నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు మాట్లాడుతూ.. ‘సీతారం సిత్రాలు’ మూవీ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. ఈ సినిమా ఈనెల 30న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ గా ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ మారుతి, రెండు పాటల్ని విడుదల చేసిన హీరో విశ్వక్సేన్, హీరో సందీప్ కిషన్ గారికి కృతజ్ఞతలు. ఇటీవల చన్ని సినిమాల కోసం కొత్త హీరోలను ఎంకరేజ్ చేయడం కోసి స్టార్ హీరోలు రావడం శుభతరుణం అని అన్నారు. చిన్న సినిమా అయిన సపోర్ట్ ఇస్తున్న హీరో కార్తికేయ కృతజ్ఞతలు. ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేసి మమల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ఆకాష్ జగన్నాథ్ కు కృతజ్ఞతలు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు అందరూ ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇక ‘సీతారాం సిత్రాలు’ మూవీ గురించి హీరో లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ.. మనం గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో సినిమా చూస్తే అలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరం ఎంతో ఇష్టంతో కష్టపడ్డాం.. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. ప్రేక్షక దేవుళ్లు ఈ సినిమాను బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఇక హీరోయిన్ భ్రమరాంబిక మాట్లాడుతూ.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఆకాశ్ పూరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దర్శకులు డి నాగ శశిధర్ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు. జంద్యాల, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి నర్సింహ లాంటి దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన కామెడీ సినిమాలు కోవిడ్ టైమ్ లో ఎక్కువగా చూశాను. ఈ సినిమా చూస్తే ప్రశాంతంగా నవ్వుకొని అన్ని టెన్షన్ల నుంచి రిలీఫ్ అవుతారని అన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నా అన్నారు.