Krishna Kowshik
Akash Puri.. పూరీ జగన్నాథ్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇ చ్చాడు ఆకాశ్ పూరీ. చైల్ట్ ఆర్టిస్టు నుండి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అయితే సరైన హిట్టు లేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలో తన పేరు మార్చుకున్నాడు.
Akash Puri.. పూరీ జగన్నాథ్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇ చ్చాడు ఆకాశ్ పూరీ. చైల్ట్ ఆర్టిస్టు నుండి ఇప్పుడు హీరోగా ఎదిగాడు. అయితే సరైన హిట్టు లేక సతమతమౌతున్నాడు. ఈ క్రమంలో తన పేరు మార్చుకున్నాడు.
Krishna Kowshik
సాధారణంగా సినిమాల్లోకి ఎంటరయ్యే సమయంలో చాలా మంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. వర ప్రసాద్ చిరంజీవిగా మారినట్లు. కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది సినీ సెలబ్రిటీలు తమ పేర్లను మార్చుకుంటున్నారు. తమ పేరులో ఓ అక్షరం జోడించడమో లేక తీసేయడమో చేస్తున్నారు. మెగా వారసుల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్.. సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. ఆ తర్వాత తన అమ్మ పేరు కలిసేలా సాయి దుర్గ తేజ్ అని నామకరణం చేసుకున్నాడు. అలాగే అదిత్ అరుణ్ కూడా త్రిగుణ్ అని పేరు మార్చుకున్నాడు. మారుతి మూవీలో ప్రభాస్ పేరు చివరిలో రెండు ఎస్ (prabhass) లు వచ్చి చేరాయి. అలాగే కల్కి 2898ఏడీలో శ్రీ ప్రభాస్ అన్న పేరు కనిపించింది. ఇప్పుడు మరో హీరో తన పేరు మార్చుకున్నాడు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ తన పేరును మార్చుకున్నాడు. జులై 25న తన పుట్టిన రోజును పురస్కరించుకుని నేమ్ ఛేంజ్ ప్రకటించాడు. తన పేరును ఆకాష్ జగన్నాథ్‌గా మార్చుకుంటున్నట్లు తెలిపాడు. గతంలో కూడా తన తండ్రి పేరులో పూరీని జత చేర్చుకోగా.. ఇప్పుడు ఆ పేరును తొలగించి.. జగన్నాథ్ అనే పేరును చేర్చుకున్నాడు. ఈ కొత్త పేరుతో కంటిన్యూ కానున్నాడు. న్యూమరాలజీ లేదా కలిసి వస్తుందని ఈ మార్పులు చోటుచేసుకున్నాయో తెలియాల్సి ఉంది. తండ్రి దర్శకుడు కాడంతో చిన్నప్పటి నుండే నటుడిగా మారాడు. చైల్ట్ ఆర్టిస్టుగా చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మ్యాన్ వంటి తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలే కాకుండా ద లోటస్ పాండ్, గబ్బర్ సింగ్, ధోనీ వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు.
ఆంధ్రా పోరీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు టాప్ డైరెక్టర్ కుమారుడు. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన మోహబూబా ఓకే అనిపించింది కానీ కమర్షియల్ సక్సెస్ కాదు. తన తండ్రి నిర్మాతగా వ్యవహరించిన రొమాంటిక్ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీని స్వయంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రమోట్ చేయడమే కాకుండా ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇక 2022లో చోర్ బజార్ వచ్చింది. ఇది కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కథలు వింటున్నాడు తప్ప.. కొత్త మూవీ ఎనౌన్స్ మెంట్ రాలేదు. మరీ పుట్టిన రోజు సందర్భంగా ఎనౌన్స్ మెంట్ ఏదైనా వస్తుందేమో చూడాలి. ఈసారి పేరు మార్పు అతడికి సక్సెస్ ను అందిస్తుందేమో వెయిట్ అండ్ వాచ్.