iDreamPost
android-app
ios-app

చోర్ బజార్ కథ ఇదేనా??

  • Published Jun 23, 2022 | 7:15 PM Updated Updated Jun 23, 2022 | 7:15 PM
  • Published Jun 23, 2022 | 7:15 PMUpdated Jun 23, 2022 | 7:15 PM
చోర్ బజార్ కథ ఇదేనా??

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఈ సారి మంచి కమర్షియల్ సినిమాతో రాబోతున్నాడు. గెహన సిప్పి హీరోయిన్ గా జార్జి రెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో చోర్ బజార్ అనే సినిమాతో జూన్ 24న ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఇందులో సీనియర్ నటి అర్చన ముఖ్య పాత్రలో నటిస్తుంది. బుధవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఆకాష్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

ఇక చోర్ బజార్ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆకాష్ పూరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కథ గురించి కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో చోర్ బజార్ కథ ఇదేనా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ.. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో చోర్ బజార్ డిఫరెంట్ సినిమా. నా మొదటి కమర్షియల్‌ సినిమా ఇది. ఇందులో బచ్చన్‌ సాబ్‌ అనే పాత్రలో కనిపిస్తాను. చోర్‌ బజార్‌ ఏరియా అనగానే మనం అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తుంటారనుకుంటాం. కానీ, దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. ఈ సినిమాలో అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు ఇవన్నీ చూపించబోతున్నాం. ఈ సినిమాలో నేనొక టైర్ల దొంగగా కనిపిస్తాను. కారు కనిపిస్తే నిమిషాల్లో దాని టైర్లు మాయం చేస్తుంటాను. ఆ టైర్లని అమ్మి ఆ డబ్బులతో చోర్‌ బజార్‌లోని పేదవారికి సాయం చేస్తుంటాను. అందుకే అక్కడి వాళ్లకు నేను హీరో.

ఇక ఇందులో హీరోయిన్ మూగ అమ్మాయి. అలాగే ఓ వజ్రం పోవడంతో అది చోర్ బజార్ లోనే ఉందని తెలిసి దాని కోసం విలన్లు వస్తారు. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. చోర్ బజార్ సెట్ వేసినా చాలా ఒరిజినల్ లాగానే ఉంటుంది అని తెలిపాడు. దీంతో ఆల్మోస్ట్ కథ చెప్పేశాడు, మరి ఆ కథని తెర మీద ఎలా చూపిస్తాడా అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet