iDreamPost
android-app
ios-app

Chor Bazaar చోర్ బజార్ రివ్యూ

  • Published Jun 25, 2022 | 11:20 AM Updated Updated Jun 25, 2022 | 3:08 PM
Chor Bazaar చోర్ బజార్ రివ్యూ

నిన్న విడుదలైన ఎనిమిది సినిమాల్లో సమ్మతమే తర్వాత అంతో ఇంతో బజ్ ఉన్నది చోర్ బజార్. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన ఈ కమర్షియల్ డ్రామాకు జీవన్ రెడ్డి దర్శకుడు. జార్జ్ రెడ్డితో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఈసారి ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. బజ్ సంగతెలా ఉన్నా ప్రమోషన్లు ఈవెంట్లు జోరుగా చేశారు. బండ్ల గణేష్ స్పీచ్ వైరల్ కావడం, మాస్ ని టార్గెట్ చేసేలా ట్రైలర్లు కట్ చేయడం కొంత మేరకు హెల్ప్ అయ్యాయి. పూర్తిగా మౌత్ టాక్ నే నమ్ముకుని బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చోర్ బజార్ ప్రేక్షకుల హృదయాలను దొంగతనం చేసిందా లేక సెల్ఫ్ అరెస్ట్ అయ్యిందా రిపోర్ట్ లో చూద్దాం

మ్యూజియం నుంచి దొంగతనం చేయబడ్డ ఓ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. టైర్ల దొంగతనంలో గిన్నిస్ రికార్డు సృష్టించాలనే మహోన్నత ఆశయం బచ్చన్ సాబ్(ఆకాష్ పూరి)ది. తెలుగు తక్కువ హిందీ ఎక్కువ మాట్లాడే వెరైటీ క్యారెక్టర్. ఇతని ఆస్థానం చోర్ బజార్. ఆ వజ్రం అటుఇటు తిరిగి మన హీరో ఉండే ప్లేస్ కు వచ్చి పడుతుంది. వందల కోట్ల విలువైన ఆ డైమండ్ కోసం విలన్ బ్యాచ్ తో పాటు ఎవరెవరో రంగంలోకి దిగుతారు. ఆఖరికి కహాని రకరకాల మలుపులు తిరిగి కోర్టుకు చేరుతుంది. అక్కడ మన బచ్చన్ సాబ్ స్పీచ్ కి ఫ్యూజులు ఎగిరిపోయిన జడ్జ్ సాబ్ ఓ మహోన్నత తీర్పు ఇచ్చేస్తాడు. ఇంతకన్నా డిటైల్డ్ గా చెప్పడం భావ్యం కాదు.

ఫిలిం స్కూల్స్ లో డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్న వాళ్లకు సినిమా ఎలా తీయకూడదో చూపించాల్సిన అత్యుత్తమ ఉదాహరణల్లో చోర్ బజార్ ని టాప్ 5లో పెట్టొచ్చు. అంత పేలవమైన కథా కథనాలతో జీవన్ రెడ్డి ఈ స్క్రిప్ట్ ని తీర్చిదిద్దారు. ఆకాష్ ఇంత అర్జెంట్ గా మాస్ హీరో అవ్వాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడో అర్థం కాదు. అవసరం లేని సన్నివేశాలు, సాగదీసి విసిగించిన ఎపిసోడ్లు బోలెడున్నాయి. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో లాజిక్ లేకపోయినా పర్లేదు కానీ ఓవర్ డ్రామా ఉండకూడదు. దాన్ని పుష్కలంగా దట్టించడంతో ఎవరికి వారు ఓవరాక్షన్ చేయడానికి పోటీ పడ్డారు. హీరోయిన్ గెహనా సిప్పికి కొత్త అవార్డులు సృష్టించి ఇవ్వాలి. అతి చేయడమే హీరోయిజం గా భావించే ఇలాంటి సినిమాలు థియేటర్ రూటు ఎంచుకోకుండా ఉండాల్సింది