iDreamPost
android-app
ios-app

Adivi Sesh: ఇష్టం లేకున్నా హీరోయిన్ తో అలాంటి సీన్ చేశా! అడవి శేష్ షాకింగ్ కామెంట్స్..

తనకు ఇష్టం లేకున్నాగానీ, స్టార్ హీరోయిన్ తో అలాంటి సీన్ చేశానని షాకింగ్ విషయాలు గుర్తుచేసుకున్నాడు స్టార్ హీరో అడవి శేష్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ సీన్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

తనకు ఇష్టం లేకున్నాగానీ, స్టార్ హీరోయిన్ తో అలాంటి సీన్ చేశానని షాకింగ్ విషయాలు గుర్తుచేసుకున్నాడు స్టార్ హీరో అడవి శేష్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ సీన్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

Adivi Sesh: ఇష్టం లేకున్నా హీరోయిన్ తో అలాంటి సీన్ చేశా! అడవి శేష్ షాకింగ్ కామెంట్స్..

అడవి శేష్.. ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ హీరో. రొటీన్ కథలు కాకుండా.. విలక్షణమైన స్టోరీలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో నెగటీవ్ రోల్స్ లో కనిపించిన శేష్, ఆ తర్వాత హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్నాడు. అయితే తనకు ఇష్టం లేకున్నాగానీ, స్టార్ హీరోయిన్ తో అలాంటి సీన్ చేశానని షాకింగ్ విషయాలు గుర్తుచేసుకున్నాడు ఈ స్టార్ హీరో. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏది? తెలుసుకుందాం పదండి.

కథ డిమాండ్ చేస్తే.. ఎలాంటి పాత్రైనా, సీన్ అయినా చేయాల్సిందే. ఈ క్రమంలో కొన్ని సీన్లు కొందరు యాక్టర్స్ కు ఇష్టం ఉండకపోవచ్చు.. కానీ తప్పదు. ఇక కెరీర్ స్టార్టింగ్ లో అయితే ఎలాంటి సన్నివేశాలు అయినా కళ్లు మూసుకుని చేసేయాల్సిందే. అలా కాదంటే, తట్టాబుట్టా సర్ధుకుని ఇండస్ట్రీ వదిలి పోవాలి. ఇలాగే తన కెరీర్ స్టార్టింగ్ లో ఇష్టం లేకున్నా గానీ హీరోయిన్ తో ఆ సీన్ లో నటించానని చెప్పుకొచ్చాడు టాలెంటెడ్ యాక్టర్ అడవి శేష్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేసి మెప్పించాడు శేష్. ఆ తర్వాత చిన్నగా హీరోగా మారాడు. స్వతహాగా రైటర్ కావడంతో.. కథలపై మంచి పట్టు సాధించి.. స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు.

అయితే రవితేజ హీరోగా చేసిన ‘బలుపు’ సినిమాలో శ్రుతిహాసన్ ను జుట్టుపట్టుకుని లాక్కెళ్లే సీన్ ఇష్టం లేకపోయినా చేశాడట శేష్. తనమీద తనకే అసహ్యం వేసిందట. ఇలాంటి పాత్రలు చేస్తున్నానా? అని సిగ్గుగా అనిపించిందట. ఆ సినిమా హిట్ అయినా గానీ తనకు ఏ మాత్రం ఉపయోగం లేదని తెలిపాడు. రవితేజ, గోపిచంద్ మలినేని పరిచయం మాత్రమే ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీన్ తర్వాత కసి పెంచుకుని, మారాలని ఫిక్స్ అయ్యాడట. ఆ తర్వాత వరుసగా 5 హిట్లు కొట్టాడు అడవి శేష్. ప్రస్తుతం గూఢాచారి 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎవరు, మేజర్, హిట్ 2, గూఢాచారి సినిమాలతో బంపర్ హిట్స్ కొట్టాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sesh Adivi (@adivisesh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి