iDreamPost
android-app
ios-app

Mohini: ‘ఆదిత్య 369’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

  • Published Dec 01, 2023 | 7:06 PM Updated Updated Dec 01, 2023 | 7:06 PM

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అనంతరం పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో జీవిస్తుంటారు. చాలా కాలం తరువాత ఆ హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. అయితే కొందరు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు. అనంతరం పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో జీవిస్తుంటారు. చాలా కాలం తరువాత ఆ హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

  • Published Dec 01, 2023 | 7:06 PMUpdated Dec 01, 2023 | 7:06 PM
Mohini: ‘ఆదిత్య 369’  హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు. అయితే వాళ్లలో కొందరు మాత్రమే స్టార్ హోదా సంపాదించి.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉండిపోతారు. మరికొందరు అయితే ఒకటి, రెండు సినిమాల్లోనే కనిపించినప్పటికి… చిత్రపరిశ్రమలో గుర్తుండిపోయేలా తమ స్థానాన్ని పదిల పర్చుకుంటారు. టాప్ హీరోయిన్స్ అవుతారనుకున్న ఆ తారలు అనుకోకుండా ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతుంటారు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీతో సంబంధం లేకుండా భర్త, పిల్లలతో  జీవిస్తున్నారు. అలాంటి  నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు మహాలక్ష్మి శ్రీనివాస్.

మహాలక్ష్మి శ్రీనివాసన్ అంటే ఎవరు పెద్దగా గుర్తుపట్టక పోవచ్చు..కానీ హీరోయిన్ మోహిని అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు గుర్తు పడతారు. నేటితరం వాళ్లకి హీరోయిన్ మోహిని పెద్దగా తెలియక పోవచ్చు. కానీ 90 దశకంలోని వారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన తర్వాత తన పేరును మోహిని శ్రీనివాసన్ గా మార్చుకున్నారు. 90లలో సినీ ఇండస్ట్రీలో ఆమె అగ్ర కథానాయికగా ఉన్నారు.

మోహిని నటించింది.. చాలా తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో నటించి మెప్పించారు. తమిళనాడులోని తంజావూరులో మోహిని శ్రీనివాసన్ జన్నించారు. చెన్నైలోని చిల్డ్రన్స్ గార్డెన్ హైయ్యర్ సెకంటరీ స్కూల్ లో చదువుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ను మోహిని ప్రారంభించారు. 1991లో ఈరమన రోజావే అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

ఈ సినిమాకు రచన, దర్శకత్వం, ప్రొడ్యూసర్ కెయార్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి  రెస్పాన్స్ వచ్చింది. దీంతో హిందీలో అభి అభి పేరుతో  ఈ సినిమాను రీమేక్ చేశారు. అందులో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.  అక్కడ కూడా ఈ మూవీ పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సినిమానే హిట్ కొట్టడంతో మోహిని వెనుదిరిగి చూసుకోలేదు.

ఈ క్రమంలోనే పలు ఆఫర్ల రావడంతో తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారారు. ఇక తెలుగులో నందమూరి బాలకృష్ణ సినిమాతో పరిచయమయ్యారు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాతో మోహిని శ్రీనివాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత డిటెక్టివ్ నారధ, మామ బాగున్నావ్, హిట్లర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన అందం, అభినయంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.

Aditya 369 heroine

ఇంకా చెప్పాలంటే.. అప్పటి అబ్బాయిల డ్రీమ్ గర్ల్ గా మోహిని మారారు. అంత క్రేజ్ సంపాదించిన కూడా మోహినికి  తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే  భరత్ ను  ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే కొన్ని కారణాలతో భర్తకు మోహిని విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో నివాసం ఉంటున్నారు. మరి.. మోహిని శ్రీనివాసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbayspin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom