రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ మూవీ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇందులో హనుమంతుడి పాత్ర చెప్పే డైలాగ్స్ఫై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. రావణాసురుడు, ఇంద్రజిత్తు క్యారెక్టర్ల గెటప్స్‌తో పాటు లంకా నగరాన్ని చూపించిన విధానంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. ‘ఆదిపురుష్’ను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ మీద నెట్టింట భారీగా ట్రోలింగ్ సాగింది. రౌత్‌కు అసలు రామాయణం గురించి ఏమాత్రం అవగాహన లేదని చాలా మంది విమర్శించారు.
‘ఆదిపురుష్’ సినిమాతో రామాయణాన్ని ఓం రౌత్ చెడగొట్టారని నెటిజన్స్ ట్రోల్ చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు సినిమా తీశారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ‘ఆదిపురుష్’ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా సారీ చెప్పారు. మూవీపై వచ్చిన కాంట్రవర్సీ మీద ఆయన స్పందించారు. ‘ఆదిపురుష్’ వల్ల జనాల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తమ వల్ల ఇబ్బంది పడిన వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెప్పారాయన. ఆ హనుమంతుడు మనందర్నీ కలసికట్టుగా, ఐక్యంగా ఉంచాలని.. మన దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానని ఇన్‌స్టా వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో మనోజ్ ముంతాషిర్ రాసుకొచ్చారు.
‘ఆదిపురుష్’ ఫిల్మ్ మీద తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మనోజ్ ముంతాషిర్ ఇన్‌స్టాలో పెట్టిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు ‘ఆదిపురుష్’ మూవీకి అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా షాక్ ఇచ్చింది. జులై 27వ తేదీన దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్‌తో పాటు డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ సినిమా ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అనే విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023