iDreamPost
android-app
ios-app

Tamannah: బెట్టింగ్ యాప్ కేసులో మిల్కీ బ్యూటీ! అసలేం జరిగిందంటే?

  • Published Oct 18, 2024 | 1:08 PM Updated Updated Oct 18, 2024 | 1:08 PM

Tamannah: బెట్టింగ్ యాప్ కేసులో గతంలో చాలా మంది సెలెబ్రెటీలు చిక్కుకున్నారు. తాజాగా తమన్నాని ఈడీ విచారించింది.

Tamannah: బెట్టింగ్ యాప్ కేసులో గతంలో చాలా మంది సెలెబ్రెటీలు చిక్కుకున్నారు. తాజాగా తమన్నాని ఈడీ విచారించింది.

Tamannah: బెట్టింగ్ యాప్ కేసులో మిల్కీ బ్యూటీ! అసలేం జరిగిందంటే?

సెలెబ్రెటీలు అన్నాక పలు బ్రాండ్ లని ప్రమోట్ చేయడం కామన్. అనేక కంపెనీలు తమ లాభాల కోసం సెలెబ్రెటీలను తమ బ్రాండ్ కి ప్రమోట్ చేయిస్తుంటాయి. అందుకు వారికి భారీగా కాసులు సమర్పించుకుంటాయి. అయితే డబ్బులు అవసరమే కానీ డబ్బులు కోసం ఏది పడితే అది ప్రమోట్ చేయకూడదు కదా. ఈ విషయంలో ఎవరు జాగ్రత్తగా వున్నా లేకున్నా సెలెబ్రెటీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెలెబ్రెటీలపై సామాన్యులకు చాలా నమ్మకం ఉంటుంది. వారిని చూస్తూ అభిమానిస్తూ ఉంటారు. అలా తమ అభిమానులకు కీడు చేసే పనులు సెలెబ్రెటీలు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ లాంటివి అస్సలు ప్రమోట్ చేయకూడదు. దాని వల్ల కచ్చితంగా చాలా చిక్కుల్లో పడతారు. ఇప్పటికే ఇలాంటి బాగోతాలు చాలానే చూశాం. కానీ ఇంకా మార్పు రావట్లేదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదని అధికారులు ఎంత చెప్తున్నా జాగ్రత్త పడట్లేదు సెలెబ్రెటీలు. డబ్బులు ఎక్కువగా వస్తున్నాయని ఇప్పటికీ ఇలాంటి వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు సెలెబ్రెటీలు. అయితే అవే ఒక్కోసారి సెలబ్రిటీలకు తలనొప్పిగా మారతాయి.

ఇంతకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్‌ విషయంలో కొందరు ఫేమస్ సెలెబ్రెటీలు ఇలాగే చిక్కుకున్నారు. ఈడీ విచారణలతో బాగా విసిగిపోయారు. ఇప్పుడు తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా వంతు వచ్చింది. చిన్నా చితక సెలెబ్రెటీ అయితే డబ్బులు కోసం ప్రమోట్ చేసి ఉంటారని అనుకోవచ్చు. కానీ అక్కడ ఉంది తమన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని పీక్ స్టేజీలో ఉంది. అలాంటిది HPZ Token అనే బెట్టింగ్ యాప్ విషయంలో మిల్కీ బ్యూటీని ఈరోజు ఈడీ విచారించింది. బిట్‌కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల మైనింగ్ కోసం డబ్బు ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ యాప్ కాన్సెప్ట్. ఇది ఓ రకమైన బెట్టింగ్ యాప్. ఈ యాప్ కి తమన్నా ప్రమోషన్స్ చేసింది. దీనికి సంబంధించి ఒక ఈవెంట్‌లో కూడా తమన్నా పాల్గొంది. ఫెయిర్‌ ప్లే బెట్టింగ్ యాప్‌లో IPL చూడాలని తమన్నా ప్రమోట్ చేసింది. ఇప్పుడు అదే ఆమెను ఈడీ ముందు ఉండేలా చేసింది. ఈ యాప్ ద్వారా కంపెనీ మోసాలకు, మనీ లాండరింగ్‌కు పాల్పడింది అంటూ దీనిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కొహిమా పోలీస్ స్టేషన్లలో కేసు రిజిస్టర్ అయ్యింది. దీంతో అక్కడి FIR ద్వారా ఈడీ రంగంలో దిగింది. ఇందులో భాగంగా ఈడీ తమన్నాను కూడా ప్రశ్నించింది.

ఈ యాప్ నిర్వహించిన ఈవెంట్‌లో తమన్నా ఎంత డబ్బు తీసుకుంది? వారు డబ్బు ఎలా చెల్లించారు? వంటి ప్రశ్నలు ఈడీ తమన్నాను అడిగినట్లు సమాచారం. దాదాపు 5 గంటల పైగా తమన్నాని విచారించారని సమాచారం. గౌహతీలోని ఈడీ ఆఫీసులో ఈ ఎంక్వైరీ జరిగింది. ఈ విచారణకు తమన్నా తల్లి దండ్రులు కూడా ఆమె వెంట వచ్చారు. అయితే ఈ కేసులో తమన్నా అయితే నిందితురాలు కాదని తేలింది. ఆమెను కేవలం HPZ టోకెన్ యాప్ వివరాలను అడగడానికి మాత్రమే పిలిపించామని ఈడీ తెలిపింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదీ మ్యాటర్. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేసినా నమ్మకండి. నష్టపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక దీని గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.