iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారి.. ఇండియన్ ఇండస్ట్రీని మడత పెట్టేస్తుంది..

  • Published May 01, 2024 | 12:50 PM Updated Updated May 01, 2024 | 12:50 PM

కాలు మీద కాలు వేసుకుని ఫోటోకు ఫోజులిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను చక్కబెట్టి.. బాలీవుడ్ పరిశ్రమలో సత్తా చాటింది. పాన్ ఇండియన్ మూవీలతో అన్ని ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ఇంతకు ఆ క్యూటీ ఎవరంటే..?

కాలు మీద కాలు వేసుకుని ఫోటోకు ఫోజులిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను చక్కబెట్టి.. బాలీవుడ్ పరిశ్రమలో సత్తా చాటింది. పాన్ ఇండియన్ మూవీలతో అన్ని ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ఇంతకు ఆ క్యూటీ ఎవరంటే..?

  • Published May 01, 2024 | 12:50 PMUpdated May 01, 2024 | 12:50 PM
ఈ ఫోటోలోని చిన్నారి.. ఇండియన్ ఇండస్ట్రీని మడత పెట్టేస్తుంది..

కొంత మంది హీరోయిన్లు చూడగానే ఫ్యాన్స్ ఇట్టే ఆకర్షితులవుతారు..వెంటనే తమ అభిమాన నటిగా మార్చేసుకుంటారు. మరి కొంత మంది ముద్దుగుమ్మలను చూడగానే అరే ఇలా ఉందేంట్రా బాబు ఈ హీరోయిన్, ఎక్కడ నుండి పట్టుకొచ్చార్రా అనిపించేలా ఉంటారు. కానీ తర్వాత మేకోవర్ అయ్యి అలరిస్తూ ఉంటారు. అలాంటి భామలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొదవ లేదు. తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆ తర్వాత సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారి.. విమర్శలు చేసిన నోళ్లతోనే ప్రశంసలు పొందారు. ఆ తర్వాత స్టార్ నటీమణిగా హవా కొనసాగిస్తుంటారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నటి ఒకరున్నారు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పాపను చూశారు కదా.. ఇప్పుడో పాన్ ఇండియన్ స్టార్. కాలు మీద కాలు వేసుకుని.. ఈ కాలు నాదే.. ఈ కాలు కూడా నాదే అంటూ ఫోజులిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసి.. బాలీవుడ్ భామలకు పోటీగా నిలిచింది. ఈమెతో నటించేందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు వరుసగా క్యూ కడుతున్నారు. కానీ తెలుగు పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో విమర్శలు ఎదుర్కొంది. కానీ అవేమీ పట్టించుకోకుండా మేకోవర్ అవుతూ.. సెకండ్ మూవీతోనే హిట్ అందుకుని ప్రశంసలు అందుకుంది. ఒక్క పాన్ ఇండియన్ మూవీతో నేషనల్ క్రష్‌గా మారింది. ఇంతకు ఆమె ఎవరో అర్థం అయ్యింది కదా. ది మోస్ట్ టాలెండ్ అండ్ బ్యూటీఫుల్ రష్మిక మందన్న. శాండిల్ వుడ్ నుండి ఎగసి పడిన ఈ చందనపు ముక్క.. అనతి కాలంలోనే టాలీవుడ్‌ను ఏలేసింది.

నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో మూవీలో సోడాబుడ్డీ కళ్లద్దాలు పెట్టుకుని.. కనిపించింది అమ్మడు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గీతా గోవిందం సినిమా ఆమెను తెలుగు ఇండస్ట్రీ మేడమ్‌ను చేసేసింది. దేవదాస్ మూవీ హిట్టుతో హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు. హీరోలకు లక్కీ హ్యాండ్ అయ్యింది. డియర్ కామ్రేడ్ ఓకే అనిపించినా.. సరిలేరు నీకెవ్వర బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. భీష్మతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కానీ రష్మికను.. క్రష్మికగా మార్చింది పుష్ప. ఇందులో ఆమె నటనకు నేషనల్ క్రష్ అయిపోయింది. అటు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. హిందీ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టి వరుస హిట్లతో దూసుకెళుతుంది. గత ఏడాది వచ్చిన యానిమల్ చిత్రం ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2, రెయిన్ బో, వెండీ కుడుములతో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş