iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ రీఎంట్రీపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు.. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?

  • Published Apr 25, 2024 | 3:49 PM Updated Updated Apr 25, 2024 | 6:20 PM

నటి లయ.. ప్రత్యేకంగా తెలుగు సినీ అభిమానులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. సుమారు దశాబ్దకాలం పాటు అలరించిన ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే...

నటి లయ.. ప్రత్యేకంగా తెలుగు సినీ అభిమానులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. సుమారు దశాబ్దకాలం పాటు అలరించిన ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే...

  • Published Apr 25, 2024 | 3:49 PMUpdated Apr 25, 2024 | 6:20 PM
టాలీవుడ్ రీఎంట్రీపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు.. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే?

భద్రం కొడుకు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన లయ.. స్వయం కృషి మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. ఈ పదాహరణాల తెలుగుమ్మాయి దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీని ఏలేసింది. మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, నాలో ఉన్న ప్రేమ, శివ రామ రాజు, మిస్పమ్మ,.. టాటా బిర్లా, మధ్యలో లైలా వరకు సినిమాలు చేసింది. బాలకృష్ణ, శివాజీ, శ్రీకాంత్, జగపతి బాబు, వేణు వంటి హీరోలతో ఆడిపాడింది. బాలయ్య మినహా మిగిలిన టాప్ హీరోలతో జతకట్టలేకపోయింది. అయినప్పటికీ టాప్ హీరోయిన్‌గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. అమెరికాకు చెందిన డాక్టర్ గణేశ్ గోర్తీని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా, పాప రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. కాగా, ఆమె తరం నటీమణులంతా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నారు. కానీ లయ మాత్రం ఉద్యోగం చేస్తోంది. ఈమె ఇటీవల ఇండియా రాగా, మీడియాను ఎట్రాక్ట్ చేసిన సంగతి విదితమే. వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు నితిన్ తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో నితిన్ సోదరి పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుపుకుంటుంది. ఇందులో కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్.

ఇదిలా ఉంటే.. తన రీ ఎంట్రీపై సోషల్ మీడియాలో వరుసగా తప్పుడు కథనాలు రావడంపై ఓ ఇంటర్వ్యూలో స్పందిచింది లయ. ‘సోషల్ మీడియాలో నా గురించి ఎప్పుడు అంత గాసిప్స్ రాలేదు. హీరోయిన్లు చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారంటే.. విడాకులయ్యి, భర్తను వదిలేశాక అడుక్కుతింటూ ఉండటం వల్ల సినిమాలు చేస్తున్నారని అనుకుంటున్నారు. నేనేం అడుక్కు తినడం లేదు. నాకేమీ డివోర్స్ కాలేదు. అప్పుడు పిల్లలు చిన్నవాళ్లు కావడంతో సినిమాలు చేయలేదు. ఇప్పుడు పెద్దవాళ్లు అయ్యారు. వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. అందుకే ఇప్పుడు నటిస్తున్నా. నేను నటించేందుకు నా పిల్లలు, భర్త పర్మిషన్ ఇచ్చాడు. అడుక్కుతినే గతి నాకు లేదు’ అని చెప్పింది లయ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio giriş