iDreamPost
android-app
ios-app

కాబోయే భర్తను పరిచయం చేసిన నటి కార్తీక

  • Published Nov 15, 2023 | 4:34 PM Updated Updated Nov 15, 2023 | 4:34 PM

సీనియర్ నటి రాధ వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కార్తీక నాయర్. నాగ చైతన్య తొలి సినిమా జోష్ .. ఆమెకు కూడా మొదటి మెట్టు. కానీ పేరు వచ్చింది మాత్రం రంగం మూవీతోనే. ఈ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ..

సీనియర్ నటి రాధ వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కార్తీక నాయర్. నాగ చైతన్య తొలి సినిమా జోష్ .. ఆమెకు కూడా మొదటి మెట్టు. కానీ పేరు వచ్చింది మాత్రం రంగం మూవీతోనే. ఈ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ..

  • Published Nov 15, 2023 | 4:34 PMUpdated Nov 15, 2023 | 4:34 PM
కాబోయే భర్తను పరిచయం చేసిన నటి కార్తీక

సీనియర్ నటి ‘రాధ’ గారి గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు క్రేజీయెస్ట్ హీరోయిన్ గా పేరు పొందిన రాధ.. నటన, డ్యాన్స్ లతో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తెలుగులో టాప్ హీరోలందరితో నటించిన ఈ కేరళ కుట్టీ.. పెళ్లి చేసుకుని  పరిశ్రమకు దూరం అయ్యింది. కొన్నాళ్ల తర్వాత..  ఆమె కుమార్తెగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది మన ముద్దుగుమ్మ ‘కార్తీక నాయర్’. తెలుగు మూవీ జోష్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కార్తీక.. కొంతకాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది . అయితే ,గత కొంతకాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటున్న కార్తీక ఒక్కసారిగా తన అభిమానులను ఒక పోస్ట్ తో ఆశ్చర్య పరిచింది. ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉన్న ఫోటోను పంచుకుని.. అందర్ని షాక్ కు గురి చేసింది.

తాజాగా తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్ ను పరిచయం చేసింది ఈ భామ. గత నెలలో ‘కార్తీక నాయర్’, ‘రోహిత్ మేనన్’ లకు నిశ్చితార్థం జరిగింది.  ఇప్పుడు  ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ప్రేమను వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం వారి ఫొటోస్ సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి. సినీ తారలు ఏ చిన్న పోస్ట్ పెట్టిన అది నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. దీనితో అభిమానులు ఈ కాబోయే నవ దంపతులకు శుభాకాంక్షలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రోహిత్ మేనన్ దుబాయ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

కార్తీక ఇండస్ట్రీ కి పరిచయం అయిన మొదటి సినిమా ‘జోష్’ . ఇది 2009 లో విడుదల అయింది.తర్వాత ఈమె 2011 లో విడుదలైన ‘రంగం’ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యి విజయాన్ని సాధించింది . ‘దమ్ము’, ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’ వంటి చిత్రాల్లో కూడా కార్తీక కీలక పాత్ర పోషిచింది. ఆ తర్వాత తెలుగు,తమిళం,మలయాళం చిత్రాల్లో మంచి పాత్రలను పోషిస్తూ గుర్తింపు సంపాదించుకుంది ఈ అమ్మడు. కానీ 2015 తరువాత నుంచి కార్తీక ఇండస్ట్రీ కి దూరంగానే ఉంటుంది. ఏదేమైనా, సినీయర్ నటి రాధా గారి కూతురిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యి తన నటనతో అందంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది.ఇక తన పెళ్లి తేదీ కోసం వేచి చూస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.పుట్టింటి నుంచి మెట్టినింట అడుగు పెట్టబోతున్న ఈ అమ్మడి జీవితం బాగుండాలని నెట్టింట అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Karthika Nair (@karthika_nair9)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetador girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom