iDreamPost
android-app
ios-app

Kajal Aggarwal: నాకెందుకు లీకులు..నేనో ఓపెన్ బుక్

  • Published Mar 22, 2024 | 1:11 PM Updated Updated Mar 22, 2024 | 1:11 PM

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభిమనంతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తాజాగా ఐ డ్రీమ్ తో తన తాజాగా చిత్రం సత్యభామ సినిమా విశేషలను పంచుకున్నారు.

చందమామ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం, అభిమనంతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. తాజాగా ఐ డ్రీమ్ తో తన తాజాగా చిత్రం సత్యభామ సినిమా విశేషలను పంచుకున్నారు.

  • Published Mar 22, 2024 | 1:11 PMUpdated Mar 22, 2024 | 1:11 PM
Kajal Aggarwal: నాకెందుకు లీకులు..నేనో ఓపెన్ బుక్

పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు…..పెద్ద హిట్లు….ఇదీ ఏ హీరోయిన్ అయినా కోరుకునేది. ఒక హీరోయిన్ స్టార్ డమ్ లోకి వెళ్ళాలంటే ఇవన్నీ కల్సివస్తేనే అదొక సక్సెస్ స్టోరీగా రికార్డవుతుంది. అదే…కాజల్ అగర్వాల్ కెరీర్లో కనిపింస్తుంది. ప్రతీ పెద్ద హీరోతోనూ ఓ హిట్ సంపాదించుకుని దాదాపు 15 ఏళ్ళ పాటు తిరుగులేకుండా నిలబడింది. ఇంక కెరీర్ నత్తనడక నడుస్తోంది అని అమెకు అనిపించిందో 2020లో మేరేజ్ ఎనౌన్స్ చేసి, అదే సంవత్సరం మేరేజ్ చేసుకుంది కూడా. తర్వాత 2022లో మదర్ హుడ్ కూడా అందుకుంది. తర్వాత దాదాపుగా కాజల్ కెరీర్ డల్ అయిపోయినట్టే. లాస్ట్ ఇయర్ వచ్చిన బాలయ్య స్టారర్ భగవంత్ కేసరి సినిమా హిట్ అవడంతో కాజల్ రెస్పెక్ట్ కూడా నిలబడినట్టుగానే అయింది.

తర్వాత కాజల్ చెప్పుకోదగ్గ ఏ సినిమాలోనూ స్థానాన్ని అందుకోలేకపోయింది. ఫ్యామిలీ బాధ్యతలను భుజాన్న వేసుకున్న ఏ హీరోయన్ కూడా రెగ్యులర్ గా సినిమాలతో నిలబడ్డ దాఖలాలు ఏ లాంగ్వేజ్ లోనూ లేవు. ఓ నిర్దిష్టమైన వయసు, పిల్లలు సంసారం లాంటివి వచ్చేశాక ఎంతటి హీరోయిన్ అయినా బుట్టదాఖలై పోవడం గానీ, లేదా అమ్మ, అక్క క్యారెక్టర్లకు సాగిపోవడానికి సిద్ధపడడం గానీ మాత్రమే జరుగుతుంటుంది. కాకపోతే ఇమేజ్ ఉన్న హీరోయిన్లకు ఓ చిన్న అడ్వాంటేజ్…..పోలీసాఫీసర్ క్యారెక్టర్. దాన్నే ఇప్పుడు కాజల్ ఆశ్రయించింది.

Kajal agarwal satya bhama interview

ప్రస్తుతం పోలీస్ ఆపీసర్ రోల్ కి సంబంధించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న కాజల్ కొంత సేపు ఐ డ్రీమ్ తో మాట్లాడింది. ఆ సినిమానే సత్యభామ. ఏంటీ సత్యభామ? సత్యభామ పాత్రకి మన పురాణాలలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలకలరాణి, క్రిష్ణుడి చేతే కాళ్ళు పట్టించుకున్న గారాల భార్య, నరకాసురుడిని సంహరించే సమయంలో గోపాలుడు నరకాసురుడి ఆయుధాల దెబ్బకి హతాసుడైపోతే, విల్లందుకుని నరకాసురుడినే సంహరించిన వీరనాయకి, తర్వాత క్రిష్ణణ్ని ఒప్పించి మరీ తులాభారానికి తెగపడి, భంగపడి, రుక్మీణి దయతో క్రిష్ణుణ్ని తిరిగి దక్కించుకుని, భక్తిమార్గంలోకి అడుగు పెట్టిన ఓ ఉత్కంఠభరితమైన పాత్ర సత్యభామది. ఇదేనా మీరు చేస్తున్న పాత్ర అని ఐ డ్రీమ్ అడిగితే అందులో ఒకటి మాత్రం నిజమని చెప్పింది కాజల్. అదేంటంటే నరకాసురుడు వంటి దుర్మార్గులను మట్టుబెట్టే వీరవనిత యాంగిల్ ఉన్న కాప్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా కాజల్ వివరించింది. ఒక్కసారి కథ వినగానే వెంటనే ఓకే చేసినట్టుగా కూడా చెప్పింది. అంత గొప్ప స్టోరీ సత్యభామ అని చెబుతూ. ఛాలెంజింగ్ క్యారెక్టరని కూడా స్పెషల్ గా కోట్ చేసింది కాజల్.

ఒక పాత్రికేయడు అంతా ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు చిరులీక్స్ లా మీరు కూడా లీకులు ఇవ్వొచ్చు కదా అని అడిగితే ‘’ అంత పెద్ద హీరోతో ఎందుకు నన్ను కంపేర్ చేస్తారు. నా వరకూ నేనైతే, ఎప్పుడూ ఏ పర్సనల్ విషయాలన్నీ కూడా మీడియా దగ్గర దాచుకోలేదు. నేనో ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ లో లీకులుంటాయా? అవసరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది కాజల్ అగర్వాల్. నిజమే. ఐశ్వర్యరాయ్ గురించో, నయనతార గురించో, రష్మికా మందానా గురించో జరిగనట్టుగా కాజల్ మీద సోషల్ మీడియాలో ఏ హల్ చల్ కూడా జరగలేదు. పెళ్ళి గురించి తనే చెప్పింది. ప్రెగ్నన్సీ గురించి తనే చెప్పింది. కాజల్ కొంత వరకూ సేఫ్ గానే ఉంది మీడియా విషయంలో.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş