iDreamPost
android-app
ios-app

ఈ పాప ఓ స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే మైండ్ బ్లాక్ చేసింది

  • Published Apr 24, 2024 | 6:06 PM Updated Updated Apr 24, 2024 | 6:06 PM

ఈ ఫోటోలోని పాపను చూశారా.. ఇప్పుడో హీరోయిన్. ఒక్క పాత్రతో మెస్మరైజ్ చేసేసింది. సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలోని పాపను చూశారా.. ఇప్పుడో హీరోయిన్. ఒక్క పాత్రతో మెస్మరైజ్ చేసేసింది. సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Apr 24, 2024 | 6:06 PMUpdated Apr 24, 2024 | 6:06 PM
ఈ పాప ఓ స్టార్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే మైండ్ బ్లాక్ చేసింది

ఒక్క సినిమా.. ఒక్క రోల్ హీరోయిన్ల ఫేట్ మార్చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్న పాత్రతో కూడా పాపులారిటీతో పాటు ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ చూస్తున్నారు భామలు. ఒక్కసారి క్లిక్ అయితే చాలు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. చిన్న పాత్రల్లో మెరిసిన భామలే.. ఆ తర్వాత మెయిన్ హీరోయిన్స్ అవుతున్నారు. లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదుగుతున్నారు. ఒక్క మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న చాలు ఇండస్ట్రీలో మూడు, నాలుగేళ్ల పాటు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాల్షీట్స్ ఖాళీ ఉండవు. ఇక ఆ స్టార్ డమ్ నిలబెట్టుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో పాప కూడా ఒక్క సీనుతోనే అరుపులు, కేకలు పుట్టించింది.

ఈ ఫోటో కనిపిస్తున్న పాప ఎవరో తెలుసా..? పుట్టింది దుబాయ్‌లో అయినా.. యాక్టింగ్ పేరుతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ నుండి టాలీవుడ్ బాట పట్టింది. తెలుగులో రెండంటే రెండు సినిమాలే చేసింది కానీ.. ఒక్క రోల్ ఓవర్ నైట్ స్టార్ చేసేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..దివ్య పిళ్లై. ఈ కేరళ కుట్టీ.. మంగళవారం సినిమాతో కాక పుట్టించిన సంగతి విదితమే. జమీందార్ భార్యగా.. రాజేశ్వరీ దేవీ పాత్రలో మతి పోగొట్టింది. ఇందులో ఎంత సౌమ్యంగా, మంచి దానిలా కనిపించే ఈ రోల్.. చివరకు నెగిటివ్ అయిపోతుంది. పిక్చర్ ఎండింగ్‌లో ఆమె క్యారెక్టర్ చూసి ఫ్యూజుల్ అవుట్ అయ్యాయి ప్రేక్షకులకు.

అస్సలు ఆమె క్యారెక్టర్ అలా ఉంటుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. పద్దతిగా, పెద్ద మనిషిలా కనిపిస్తూ.. చివరకు ఆమె చేసే రాసలీలలు చూసి షాక్ అయ్యారు. ఈ మూవీ ఇదే బిగ్గెస్ట్ ట్విస్ట్. ఇందులో దివ్య పిళ్లైకి మంచి మార్కులు పడ్డాయి. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత కన్నా ఈ భామకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయల్ నజనల్ల సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన తగ్గేదెలే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మంగళవారం సినిమాతో మెస్మరైజ్ చేసింది. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న బజూక అనే చిత్రంలో నటిస్తోంది అమ్మడు. ద విలేజ్ వెబ్ సిరీస్‌లో కూడా ఆకట్టుకుంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio