iDreamPost
android-app
ios-app

నితిన్ హీరోయిన్‌కి నాలుగు సార్లు అబార్షన్ జరిగిందా? ఆమె ఏం చెప్పిందంటే?

  • Published May 04, 2024 | 9:18 PM Updated Updated May 04, 2024 | 9:18 PM

ఆ హీరోయిన్ లైఫ్ అంతా గందరగోళంగానే సాగింది. ప్రముఖ హీరో కిడ్నాప్ చేయడం.. ఆమె మీద లైంగిక దాడి చేయడం.. దీంతో ఆ హీరోయిన్ బాగా అప్ సెట్ అవ్వడం చాలా గందరగోళం నెలకొంది.

ఆ హీరోయిన్ లైఫ్ అంతా గందరగోళంగానే సాగింది. ప్రముఖ హీరో కిడ్నాప్ చేయడం.. ఆమె మీద లైంగిక దాడి చేయడం.. దీంతో ఆ హీరోయిన్ బాగా అప్ సెట్ అవ్వడం చాలా గందరగోళం నెలకొంది.

  • Published May 04, 2024 | 9:18 PMUpdated May 04, 2024 | 9:18 PM
నితిన్ హీరోయిన్‌కి నాలుగు సార్లు అబార్షన్ జరిగిందా? ఆమె ఏం చెప్పిందంటే?

కేరళ నుంచి వచ్చింది. తెలుగులో మూడే మూడు సినిమాలు చేసింది. నితిన్, గోపీచంద్, శ్రీకాంత్ లతో కలిసి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు లేక తన సొంత గూటికి వెళ్ళిపోయింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఒక స్టార్ హీరో కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ చేదు గతాన్ని మర్చిపోవడానికి కొన్నాళ్ళు సినిమాలకు  బ్రేక్ ఇచ్చింది. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ తెరపైకి వచ్చింది. కానీ ఆమె నాలుగు సార్లు అబార్షన్ చేయించుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. 

ఆ హీరోయిన్ మరెవరో కాదు భావన. గోపీచంద్ నటించిన ఒంటరి సినిమాతో టాలీవుడ్ కి  పరిచయమైంది కేరళ భామ్మ భావన. ఆ తర్వాత హీరో, మహాత్మ సినిమాల్లో నటించింది. అంతే ఇక ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కన్నడ, మలయాళ చిత్రాలు మాత్రమే చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు కన్నడ చిత్రాలు, ఒక మలయాళం, ఒక తమిళ సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ హీరోయిన్ కి నాలుగు సార్లు అబార్షన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ హీరోయిన్ ని ఓ స్టార్ హీరో కిడ్నాప్ చేసి.. లైంగిక దాడి చేశాడు. దీనికి సంబంధించిన కేసులో మలయాళ హీరో దిలీప్ ని అరెస్ట్ కూడా చేశారు. ఈ వివాదాలతో కొన్నాళ్ళకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన.. 2018లో ప్రొడ్యూసర్ నవీన్ ను వివాహం చేసుకుంది.

ప్రస్తుతం అంతా మర్చిపోయి ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటుంది. తాజాగా ఆమె నటించిన మలయాళ మూవీ నడికర్ ప్రమోషన్ లో భాగంగా ఆమె తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా అని.. గర్భస్రావం అయ్యిందని.. చెన్నైలో అబార్షన్ చేయించుకున్నా అంటూ రూమర్స్ క్రియేట్ చేశారని.. తలచుకుంటే అసహ్యం వేస్తుందని భావన తెలిపింది. నాలుగు సార్లు అబార్షన్ అయ్యిందని, గర్భస్రావం అవ్వడం వల్ల చనిపోయానని కూడా ప్రచారం చేశారని ఆమె వెల్లడించింది. అయితే అప్పుడు తన గురించి రూమర్స్ విని మానసికంగా చాలా బాధపడ్డానని.. అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని భావన వెల్లడించింది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet