ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం మేకింగ్ విషయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పాత్రల తీరు, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్, మాటల విభాగాల్లో తీవ్ర విమర్శలను ఆదిపురుష్ టీమ్ ఎదుర్కొంటోంది. తాజాగా ఆదిపురుష్ సినిమాపై కామెంట్స్ చేశారు హీరో, నటుడు సుమన్. అసలు ఆదిపురుష్ రామాయణంలా లేదని గ్లాడియేటర్ లా ఉందని వ్యాఖ్యానించారు.
ఆదిపురుష్.. దేశం మెుత్తం వివాదాలతో నలిగిపోతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు ఈ చిత్రంపై వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ సినిమా ప్రదర్శనలను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక తొలి మూడు రోజులు భారీ వసూళ్లు సాధించిన ఆదిపురుష్.. తర్వాత నుంచి చతికిలపడింది. వీక్ డేస్ లల్లో కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. కాగా.. ఆదిపురుష్ సినిమాపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు నటుడు, హీరో సుమన్. ఆదిపురుష్ సినిమా ఆడియన్స్ కు నచ్చకపోవడానికి ప్రధాన కారణం భావోద్వేగాలు పండకపోవడే అని సుమన్ అన్నారు.
ఇక మనకు తెలిసిన రాముడు, కృష్ణుడు అంటే నీలం రంగులో కనిపిస్తారు. కానీ ఇక్కడ గడ్డాలు, మీసాలతో చూపించారు ఓం రౌత్. ఇది పెద్ద రిస్క్ అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని సుమన్ తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తప్పు లేదని అతడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అంటూ ప్రశంసించారు. అదీకాక ఈ సినిమాలో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి పాత్రలకు ఎంచుకున్న కాస్ట్యూమ్స్.. హాలీవుడ్ గ్లాడియేటర్ సినిమాను తలపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇదే ఓం రౌత్ చేసిన పెద్ద తప్పుగా సుమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా.. రామాయణం లాంటి చిత్రాలు చేసేటప్పుడు ప్రయోగాలు చేసి రిస్క్ తీసుకోవడం పెద్ద తప్పు అని సుమన్ తెలిపారు. అందుకే ఆదిపురుష్ ప్రేక్షకులకు నచ్చలేదన్నారు. ఇక రామాయణం, మహాభారతం లాంటి సినిమాలు తీయాలి అంటే దక్షిణాది డైరెక్టర్లకే సాధ్యం అంటూ కితాబిచ్చారు సుమన్. దర్శక దీరుడు రాజమౌళి అయితే రామాయణానికి న్యాయం చేస్తారని, ఆయన తెరకెక్కిస్తే.. ఆ సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్తుందని ఈ సందర్భంగా సుమన్ అభిప్రాయ పడ్డారు.