iDreamPost
android-app
ios-app

దయజేసి మమ్మల్ని ఎంకరేజ్‌ చేయండి.. సోహేల్‌ ఆవేదన

  • Published Jan 22, 2024 | 2:08 PM Updated Updated Jan 22, 2024 | 2:08 PM

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా .. యారగెంట్‌ యాటిట్యూడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోహెల్‌. ఆయన తాజా చిత్రం ‘బూట్‌ కట్‌ బాల రాజు’ విడుదలకు సిద్ధంగా ఉంది.

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా .. యారగెంట్‌ యాటిట్యూడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోహెల్‌. ఆయన తాజా చిత్రం ‘బూట్‌ కట్‌ బాల రాజు’ విడుదలకు సిద్ధంగా ఉంది.

  • Published Jan 22, 2024 | 2:08 PMUpdated Jan 22, 2024 | 2:08 PM
దయజేసి మమ్మల్ని ఎంకరేజ్‌ చేయండి.. సోహేల్‌ ఆవేదన

బిగ్‌బాస్‌ షోతో తెలుగు నాట మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు సోహెల్‌. దాదాపు 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. కెరీర్‌ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు. తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. తన దైన శైలి యాటిట్యూడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షో అయిపోయిన తర్వాత కూడా అతడికి క్రేజ్‌ తగ్గలేదు. బయటకు వచ్చిన తర్వాత హీరోగా అవకాశాలు రావటం మొదలైంది.

ఈ నేపథ్యంలోనే ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ అనే సినిమా చేశారు. 2023, ఆగస్టు నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ హిట్‌గా నిలిచింది. కానీ, కమర్షియల్‌గా మాత్రం సోసో అనిపించుకుంది. ఆయన ప్రస్తుతం బూట్‌ కట్‌ బాలరాజు అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సోహెల్‌ చిన్న హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పది రోజుల క్రితం సంక్రాంతి టైంలో తాను ఓ యంగ్ హీరోకు ఫోన్ చేశానని చెప్పాడు. ఆ యంగ్‌ హీరో ఫోన్‌ లిఫ్ట్ చేశాడని, సోహెల్ అని తన పేరు చెప్పగానే.. వెంటనే కట్ చేశాడని అన్నారు. మళ్లీ లిఫ్ట్ చేయలేదని చెప్పారు. ‘ సక్సెస్ కొట్టిన హీరో.. పెద్ద సీనియర్ హీరో అయిన వెంకటేష్ గారికి మెసెజ్ చేస్తే రిప్లై ఇచ్చారన్నారు. ఆ రిప్లై చూసి తనకు ఎంతో ఆనందం వేసిందని అన్నారు. చిన్న హీరోలు అలా చేయడం తనకు బాధగా అనిపించిందని తెలిపారు.

తన లాంటి యంగ్ స్టర్స్‌ ఎవరైనా వస్తే సాయం చేయండని విజ్ఞప్తి చేశారు. ఎంకరేంజ్‌ చేయాలని సూచించారు. కనీసం ఓ మాట, ఓ రిప్లై అయినా ఇవ్వండంటూ సోహెల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను షార్ట్ ఫిల్స్, కొత్త బంగారు లోకంలో జూ. ఆర్టిస్ట్ నుంచి కెరీర్ మొదలు పెట్టి.. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ‘ మన మీద మనకు నమ్మకం ఉండాలి.. నిరంతరం పోరాడుతూ ఉండాలి.. అదే నేను నమ్ముతాను’ అని పేర్కొన్నారు. మరి, చిన్న హీరోలపై సోహెల్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet