iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఓ స్టార్ హీరో కూతురు! ఇప్పుడు అందాల బొమ్మ

  • Published Feb 24, 2024 | 8:50 PM Updated Updated Feb 24, 2024 | 8:50 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి భలే ముద్దుగా ఉంది కదూ.. కుందేలు పిల్లలా ఉన్న ఈ పాప.. స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి భలే ముద్దుగా ఉంది కదూ.. కుందేలు పిల్లలా ఉన్న ఈ పాప.. స్టార్ హీరో కూతురు. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Feb 24, 2024 | 8:50 PMUpdated Feb 24, 2024 | 8:50 PM
ఈ చిన్నారి.. ఓ స్టార్ హీరో కూతురు! ఇప్పుడు అందాల బొమ్మ

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ చిన్న అపవాదు ఉంది. టాలెంట్ ఉన్నా కూడా తెలుగు అమ్మాయిలను దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వరని. ఒకటి రెండు సినిమాలు చేశాక..పత్తా లేకుండా పోతుంటారు. మరో ఇండస్ట్రీలో ప్రత్యక్షమై అక్కడ సత్తా చాటాక.. అప్పుడు కానీ మన ఇండస్ట్రీ పట్టించుకోదు. స్వాతి రెడ్డి, అంజలి ఇప్పటి గౌరీ ప్రియ వరకు అది నిజమనిపించక మానదు. తమిళంలోనే లేదా మలయాళ ఇండస్ట్రీలో ఒకటి రెండు హిట్స్ పడగానే.. అరె మనమ్మాయి అంటూ అవకాశాలు ఇస్తుంటారు. ఇందులో నిజనిజాలు ఎంతో తెలియదు కానీ ఈ అమ్మాయి కూడా పక్కా హైదరాబాదీ. బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదే. స్టార్ హీరో కూతురు కూడా. ఆలస్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తోంది.

ఈ ఫోటోలోని కుందేలు పిల్లలా కనిపిస్తున్న క్యూటీనీ చూశారా.. ఎవరో గుర్తు పట్టారా..? చేసినవి కొన్ని సినిమాలే అయినా.. ఓటీటీల్లో రిలీజైనవే ఎక్కువ. తెలుగులో కన్నా తమిళంలో పాపులర్ అయ్యింది. పోనీ బ్యాగ్రౌండ్ లేదా అంటే.. పేరెంట్స్ ఇద్దరూ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. కానీ తెలుగులో అయితే సరైన గుర్తింపు రాలేదు. సినిమాల్లో చేస్తూ.. మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. కానీ అనూహ్యంగా అనారోగ్య సమస్యలతో తప్పుకుంది. గత ఏడాది మూడు సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ.. మంచి ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే.. యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్, జీవితల గారాల పట్టి శివానీ రాజశేఖర్.

రాజశేఖర్, జీవితలకు ఇద్దరు కూతుర్లు అన్న విషయం తెలిసిందే. శివానీ పెద్ద కుమార్తె. శివాత్మిక చిన్నమ్మాయి. కానీ అక్క కన్నా ముందుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శివాత్మిక. శివానీ కాస్త ఆలస్యంగానే  కెరీర్ స్టార్ చేసింది. రోషన్, శ్రీలీల పెళ్లి సందడిలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆమెకు అంత పేరు తీసుకు రాలేదు. 2021లో హనుమాన్ హీరో సజ్జా తేజతో కలిసి అద్భుతం అనే చిత్రం చేయగా.. అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు, అన్బరివు అనే చిత్రం కూడా ఓటీటీల్లో రిలీజ్ కావడం గమనార్హం. తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. ఆమెకు తొలి థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేసింది మాత్రం తమిళ్ మూవీతోనే.

హిందీ మూవీ ఆర్టికల్ 15 తమిళ రీమేక్ నెంజుకు నీదిలో నటించింది. తెలుగులో శేఖర్, కోట బొమ్మాళిలో నటించింది. కోట బొమ్మాళిలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ‘ నాయమ్మ, నాతల్లి’ సాంగ్ యూట్యూబ్ ను షేక్  చేసేసింది. ఆహా నా పెళ్లి అంట అనే మూవీలో రాజ్ తరుణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ నుండి టీవీలో సందడి చేసేందుకు సిద్ధమౌతుంది. ప్రస్తుతం విద్య, వాసుల అహం అనే మూవీ చేస్తోంది. ఈ మూవీ టీజర్ కూడా విడుదలై రెండు నెలలు అయిపోయింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటించలేదు. కోటబొమ్మాళిలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న రాహుల్ విజయ్ ఈ సినిమాలో హీరో. తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అందాల బొమ్మ.. ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetup girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş