Keerthi
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు దర్శన్ బెయిల్ కోసం ప్రయాత్నించి విఫలైమన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె. శివకుమార్ ను కలిసింది. అయితే దర్శన్ కేసు విషయం కోసం మాత్రం కాదట. ఇంతకి ఎందుకంటే..
కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు దర్శన్ బెయిల్ కోసం ప్రయాత్నించి విఫలైమన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె. శివకుమార్ ను కలిసింది. అయితే దర్శన్ కేసు విషయం కోసం మాత్రం కాదట. ఇంతకి ఎందుకంటే..
Keerthi
కన్నడ స్టార్ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఇక దర్శన్ తో పాటు ఈ హత్యకు కారకురాలైన ప్రియురాలు పవిత్ర గౌడ్ ను పోలీసు అరెస్టు చేశారు. అలాగే ఈ కేసులో సంబంధం ఉన్న మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో బలమైన ఆధారాలు లభ్యం కావడంతో.. పవిత్ర గౌడ్ ఏ1 ముద్దయిగా, దర్శన్ ఏ2 ముద్దయిగా జైలు జీవితం గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ కేసు దర్శన్ కు యమపాశంలా చుట్టుకుంది. ఎందుకంటే.. కనీసం ఇప్పటి వరకు బెయిల్ కూడా వచ్చే దాఖాలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె. శివకుమార్ ను కలిసింది. అయితే దర్శన్ కేసు విషయం కోసం మాత్రం కాదట. ఇంతకి ఎందుకంటే
హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టు అయ్యి జైలుకి వెళ్లిన దగ్గర నుంచి అతడి భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయాత్నిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు దర్శన్ బెయిల్ కోసం ప్రయాత్నించి విఫలైమన విషయం తెలిసిందే. పైగా ఇటీవలే జ్యూడీషయల్ రిమాండ్ ని కోర్టు మళ్లీ ఆగస్టు 1 వరకూ పొడిగించింది. దీంతో దర్శన్ పరప్పన్ అగ్రహారం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చిది. ఇకపోతే తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె.శివకుమార్ ని కలిసే ప్రయత్నం చేసారట. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం డీకె. శివకుమార్ మాట్లాడుతూ.. ‘తాను కేంపే గౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి కలిసిందన్నారు. అప్పుడే ఇక్కడ కాదు..ఇంటికి వచ్చి కలమని చెప్పాను. అయితే విజయలక్ష్మి నన్ను కలిసి దర్శన్ కేసు గురించి మాట్లాడతారు అనుకున్నా.. కానీ, వారి కుమారుడు స్కూల్ అడ్మిషన్ కోసం ఆమె వచ్చారని’ డీకే అన్నారు. ఇదిలా ఉంటే.. డీకే ఇంటికి వెళ్లిన వారిలో దర్శన్ భార్యతో పాటు, సోదరుడు దినకర్, డైరెక్టర్ ప్రేమ్ కూడా ఉన్నారు. అయితే ఇటీవలే రామ్ నగర్ లో జరిగిన ఓకార్యక్రమంలో డీకే.. దర్శన్ కి అన్యాయం జరిగితే గనుక తప్పకుండా తన సహకారం ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం విజయలక్ష్మి డీకేని కలవడంమనేది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పైగా కుమారుడి స్కూల్ అడ్మిషన్ గురించి డీకేను కలిసిందా? దర్శన్ కోసం కలిసిందంటూ? నెట్టింట చర్చలు మొదలయ్యాయి. మరి, దర్శన్ భార్య విజయలక్ష్మి కుమారుడి అడ్మిషన్ కోసం డీకే ను కలవటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.