iDreamPost
android-app
ios-app

OTT ఫ్యాన్స్ కోసం ఈవారం విందు

  • Published May 16, 2022 | 4:19 PM Updated Updated May 16, 2022 | 4:19 PM
OTT ఫ్యాన్స్ కోసం ఈవారం విందు

ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల కోసం ఎదురు చూసినట్టే ఇప్పుడు ప్రత్యేకంగా ఓటిటి రిలీజుల కోసం వెయిట్ చేసే మూవీ లవర్స్ ఎక్కువయ్యారు. ఇదంతా కరోనా అండ్ లాక్ డౌన్ మహాత్యమే. థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పటికీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఇండిపెండెంట్ మూవీస్ కోసం డిజిటల్ సంస్థలు క్రమం తప్పకుండా పోటీ పడుతున్నాయి. అందులోనూ ఈ మే 20 చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవడంతో పాటు అదే స్థాయిలో గొప్ప విజయం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ జీ5 ద్వారా ప్రేక్షకుల ముందు రానుంది. కాకపోతే పే పర్ వ్యూ మోడల్ లో డబ్బులు కట్టి చూడాల్సి ఉంటుంది.

యాభై రోజులు పూర్తి చేసుకున్న సినిమాకు ఇలా అదనంగా సొమ్ములు చెల్లించడం ఏమిటనే కామెంట్స్ ఉన్నప్పటికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక మెగా డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న ‘ఆచార్య’ కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్ లో రానుంది. చిరంజీవి కెరీర్లో ఎన్నడూ లేనంతగా 80 కోట్ల దాకా నష్టాన్ని చవిచూసిన ఈ సినిమాని చూడని వాళ్ళు కోట్లలో ఉన్నారు. టాక్ విని రివ్యూలు చూసి ఎలాగూ థియేటర్ దాకా వెళ్లలేదు కాబట్టి మెగాస్టార్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ ని ఒకసారి ఖచ్చితంగా చూస్తారు. ఈ అంచనాతోనే ప్రైమ్ మూడు వారాలకే స్ట్రీమింగ్ చేయడానికి అదనంగా 18 కోట్లు చెల్లించిందని టాక్.

శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’ మే 20నే డిస్నీ హాట్ స్టార్ లో వస్తోంది. ఇది మరీ అన్యాయంగా 14 రోజులకే స్మార్ట్ స్క్రీన్ దారి పట్టేసింది. బ్రేక్ ఈవెన్ పావు వంతు కూడా చేరలేకపోయిన ఈ సినిమాని ఓటిటిలో బాగానే చూడొచ్చు. ఇవి కాకుండా జీ5లోనే ‘జాంబ్లీవి’, నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ మూవీస్ ‘ది ఇన్విజిబుల్ మ్యాన్’, ‘ది హంట్’, ‘హూ కిల్డ్ సారా’ వస్తున్నాయి. ఊట్ యాప్ లో కన్నడ మూవీ ‘హనుమాన్’ రిలీజ్ అవుతుంది. సో మొత్తానికి ఆర్ఆర్ఆర్ బరిలో ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఓటిటి రిలీజులు ఈ వారం ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఇంకొన్ని చిన్నా చితక ఉన్నాయి కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం వీటి మీదే పెడుతున్నారు