iDreamPost
android-app
ios-app

Acharya : ఆచార్యకు ముక్కోణపు ప్రేమకథ కాంపిటీషన్

  • Published Feb 23, 2022 | 2:33 PM Updated Updated Dec 20, 2023 | 6:36 PM

అందుకే పదే పదే వాయిదాలు తప్పడం లేదు. ఏప్రిల్ 29న విడుదలకు ఇప్పటిదాకా లాక్ అయ్యింది ఒక్క ఆచార్య మాత్రమే. 28 రావాలనుకున్న ఎఫ్3 అనవసరమైన రిస్క్ ఎందుకని మే నెలకు షిఫ్ట్ అయ్యింది.

అందుకే పదే పదే వాయిదాలు తప్పడం లేదు. ఏప్రిల్ 29న విడుదలకు ఇప్పటిదాకా లాక్ అయ్యింది ఒక్క ఆచార్య మాత్రమే. 28 రావాలనుకున్న ఎఫ్3 అనవసరమైన రిస్క్ ఎందుకని మే నెలకు షిఫ్ట్ అయ్యింది.

  • Published Feb 23, 2022 | 2:33 PMUpdated Dec 20, 2023 | 6:36 PM
Acharya : ఆచార్యకు ముక్కోణపు ప్రేమకథ కాంపిటీషన్

థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం మొదలుపెట్టాక రిలీజ్ డేట్ల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. క్లాష్ కాకుండా తమ సినిమాలు సోలో రిలీజ్ చేసుకోవడం పెద్ద నిర్మాతలకు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అందుకే పదే పదే వాయిదాలు తప్పడం లేదు. ఏప్రిల్ 29న విడుదలకు ఇప్పటిదాకా లాక్ అయ్యింది ఒక్క ఆచార్య మాత్రమే. 28 రావాలనుకున్న ఎఫ్3 అనవసరమైన రిస్క్ ఎందుకని మే నెలకు షిఫ్ట్ అయ్యింది. అప్పటిదాకా దాదాపు ప్రధానమైన పాన్ ఇండియా సినిమాలన్నీ పూర్తయ్య ఉంటాయి కాబట్టి ఆపై మీడియం రేంజ్ వి క్యూ కడతాయి. ఏప్రిల్ లో కెజిఎఫ్ 2 ఒకటే భారీ ఎత్తున వస్తన్న మూవీ. తర్వాత లిస్టులో నెక్స్ట్ ఆచార్యనే.

సరే పోటీ లేదుకదా అనుకోవడానికి లేకుండా దీనికి సైతం కాంపిటీషన్ వచ్చింది. కాకపోతే ఆ స్థాయిది కాకపోయినా అన్ని భాషల్లోనూ టార్గెట్ చేసిన ఆచార్యకు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ఆ సినిమా పేరు కాతువాకుల రెండు కాదల్. విజయ్ సేతుపతి హీరోగా సమంతా నయనతార క్రేజీ కాంబినేషన్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ఇక్కడ దీనికి అంత హైప్ లేకపోయినా తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయ్యే నాటికి బజ్ రాకమానదు. కథ ఇక్కడితో అయిపోలేదు. వేరే సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. టీజర్ ఆ మధ్య జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది.

ఆచార్యకు దీని వల్ల వచ్చిన చిక్కేమి లేదు కానీ నేరుగా మెగాస్టార్ మూవీతో ఢీ కొట్టడం మాత్రం సాహసమే. పుష్పలో ఊ అంటావా పాటతో కంబ్యాక్ ఇచ్చిన సమంతాకు ఈ సక్సెస్ చాలా కీలకం. దీని తర్వాత గుణశేఖర్ శాకుంతలం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో రూపొందుతున్న వెబ్ సిరీస్ కూడా షూటింగ్ పూర్తి చేసుకునే దిశగా వెళ్తోంది. పెళ్లయ్యాక కూడా మంచి స్పీడ్ ప్లాన్ చేసుకున్న సామ్ కు ఒకవేళ ఈ బ్రేక్ కనక దక్కితే ఇమేజ్ ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. సూపర్ డీలక్స్ లాంటి విభిన్నమైన సినిమాలు చేస్తున్న సమంతాకు నయనతార కాంబో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి

Also Read : Kiara Advani : విజయ్ దేవరకొండ కోసం పాన్ ఇండియా హీరోయిన్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobet