iDreamPost
android-app
ios-app

Kiara Advani : విజయ్ దేవరకొండ కోసం పాన్ ఇండియా హీరోయిన్

  • Published Feb 23, 2022 | 2:26 PM Updated Updated Feb 24, 2022 | 3:52 PM
  • Published Feb 23, 2022 | 2:26 PMUpdated Feb 24, 2022 | 3:52 PM
Kiara Advani : విజయ్ దేవరకొండ కోసం పాన్ ఇండియా హీరోయిన్

ప్రస్తుతం లైగర్ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాడు. మళ్ళీ పూరి జగన్నాధ్ తోనే జనగణమన చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో తీయాల్సిన మూవీ రౌడీ బాయ్ చేతికి రావడం పట్ల ఫ్యాన్స్ మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం క్యాస్టింగ్ తో పాటు ఇతరత్రా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న పూరి టీమ్ అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతోంది. వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి కొంత బ్రేక్ ఇస్తారు. ఆగస్ట్ లో రిలీజయ్యే లైగర్ ప్రమోషన్స్ కోసం ఓ రెండు నెలలు మొత్తం బృందం నేషనల్ లెవెల్ లో ఈవెంట్లు గట్రా ప్లాన్ చేసుకునే విధంగా షెడ్యూల్స్ వేస్తున్నారు.

జనగణమన తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. ఇది ఎప్పుడో ఫిక్స్ అయినప్పటికీ కరోనా తదితర కారణాల వల్ల ఫైనల్ గా ఇప్పుడు వేగమందుకోబోతోంది. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారట. ఎలాగూ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ఇది కూడా ఆ ఫ్లేవర్ లోనే రూపొందించేలా శివ నిర్వాణని స్క్రిప్ట్ లాక్ చేశారని సమాచారం. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చేస్తున్న టైంలోనే కియారా తనకు విజయ్ దేవరకొండ ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పింది. సో ఈ జోడి సెట్ కావడం పెద్ద కష్టమేమి కాదు.

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ బాలీవుడ్ హీరోయిన్లను పెట్టుకోవడం మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా కామన్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ లో అలియా భట్, లైగర్ లో అనన్య పాండే లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళు హిందీలో విస్తృతంగా సినిమాలు చేస్తున్నారు. సో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న వాళ్ళైతేనే మార్కెట్ పరంగా బిజినెస్ ఈజీ అవుతోంది. ఇది దృష్టిలో పెట్టుకునే హీరోలు దర్శకులు తమ ప్రాధాన్యతలు మార్చుకుంటున్నారు. రామ్ చరణ్, మహేష్ బాబుతో జంట కట్టిన కియారా అద్వానీ మరి విజయ్ దేవరకొండతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి

Also Read : https://idreampost.com/news/movies/bheemla-nayak- 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet