iDreamPost
android-app
ios-app

అప్పట్లో మహేష్ బాబు మరదలిగా.. ఇప్పుడు అత్తగా.. ఆ నటి ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Mar 07, 2024 | 4:20 PM Updated Updated Mar 14, 2024 | 4:43 PM

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి ఆరుగురు పతివ్రతలు. చిన్న నాటి స్నేహితులు మళ్లీ కలుసుకుని.. తమ మొమొరీస్ పంచుకుంటారు. ఈ సర్కిల్లో కనిపిస్తున్న బ్యూటీ.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి ఆరుగురు పతివ్రతలు. చిన్న నాటి స్నేహితులు మళ్లీ కలుసుకుని.. తమ మొమొరీస్ పంచుకుంటారు. ఈ సర్కిల్లో కనిపిస్తున్న బ్యూటీ.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

  • Published Mar 07, 2024 | 4:20 PMUpdated Mar 14, 2024 | 4:43 PM
అప్పట్లో మహేష్ బాబు మరదలిగా.. ఇప్పుడు అత్తగా.. ఆ నటి ఎవరో గుర్తు పట్టారా..?

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ పండించడంలో జంధ్యాల తర్వాత ఆయనే అని ముద్ర పడింది. అలా అని అచ్చంగా ఫన్ మూవీసే తీశారనుకుంటే పొరపాటు.. కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ అండ్ లవ్ చిత్రాలను కూడా రూపొందించారు. ఆమె, మగరాయుడు వంటి లేడీ ఓరియెంట్ పిక్చర్స్ కూడా తీశారు. ఈవీవీ సినిమాల్లో ఏ చిత్రం బెస్ట్ అంటే చెప్పడం కష్టం. కొత్త కాన్సెప్టుతో జంబలకడీ పంబ అనిపించినా.. భార్యను ప్రేమించిన వ్యక్తికి అప్పగించే కన్యాదానం లాంటి డేరింగ్ సినిమాలు తీయాలన్న ఆయనకే సాధ్యం. ఇదే కాదూ.. ఆయన ఖాతాలో ఆరుగురు పతివత్రలు వంటి అండర్ రేటెడ్ చిత్రాలు ఉన్నాయి.

ఆరుగురు కొత్త హీరోలు, ఆరుగురు హీరోయిన్లు, ఆరుగురు చైల్డ్ ఆర్టిస్టులు, ఆరుగురు కామెడీ ఆర్టిస్టులతో తెరకెక్కించిన చిత్రమే ఆరుగురు పతివ్రతలు. టైటిలే అప్పట్లో చర్చించుకునేలా చేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. కృష్ణ కౌశిక్, రవి వర్మ, లహరి, హారిక వంటి నటీనటులు  ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఇప్పటికీ వీరిలో కొంత మంది పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. 2004లో విడుదలైన ఈ అడ్వాన్స్ డ్ స్టోరీ చిత్రం.. అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ మూవీకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ చిత్రంలో చిన్నప్పుడు విడిపోయిన ఆరుగురు అమ్మాయిలు.. తిరిగి కలుసుకుని.. తమ జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి స్నేహితులతో పంచుకుంటారు. ఇందులో ఓ అబ్బాయి చేతిలో ఇద్దరు అమ్మాయిలు మోసపోతారు. గుర్తుందా.. వారిలో ఒకరు లహరి కాగా, మరో అమ్మాయి హారిక.. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలిస్తే నోరెళ్ల బెడతారు.

హారిక ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ఎవడిగోల వాడిదే, మొగుడు, పెళ్లామ్స్, రాజా బాబు, అతడు, అందగాడు, సింహాచలం వంటి అనేక చిత్రాల్లో నటించింది. అతడు మూవీ సినిమాలో కూడా త్రిష కజిన్ పాత్రలో కనిపిస్తుంది అమ్మడు. అప్పట్లో త్రివిక్రమ్ సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో కనిపించిన హారిక.. ఇంచు మించు 20 ఏళ్ల తర్వాత మళ్లీ తివ్రికమ్ మూవీలోనే నటించింది. అందులో హీరో కూడా మహేష్ బాబు కావడం విశేషం. ఇంతకు ఆ మూవీ ఏంటంటే.. గుంటూరు కారం. అతడు మూవీలో మహేష్ బాబుకు మరదలి రోల్ చేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు అత్త పాత్రలో కనిపించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఆమెకు చెప్పుకోదగ్గ డైలాగ్స్ ఉండవు. గుంటూరు కారంలో శ్రీలీల మరదలి పాత్రలో కనిపించిన నటి ఈమెనే. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయే క్యారెక్టర్. కానీ మహేష్, త్రివిక్రమ్ అలానే ఉన్నారు. కానీ హారిక కాస్త బొద్దుగా మారి ఇప్పుడు అమ్మ రోల్స్ కు పరిమితం అయ్యింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom