iDreamPost
android-app
ios-app

Devara: వీడియో: దేవర షూటింగ్‌ వీడియో లీక్‌! ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Published Mar 22, 2024 | 12:09 PM Updated Updated Mar 22, 2024 | 12:09 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా "దేవర". ఇప్పుడు తారక్ అభిమానుల ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. దేవర సినిమాను దసరా కు రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా "దేవర". ఇప్పుడు తారక్ అభిమానుల ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. దేవర సినిమాను దసరా కు రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 22, 2024 | 12:09 PMUpdated Mar 22, 2024 | 12:09 PM
Devara: వీడియో: దేవర షూటింగ్‌ వీడియో లీక్‌! ఫ్యాన్స్‌కు పూనకాలే..

రాజమౌళితో పాన్ ఇండియా సినిమాలో కనిపించిన తర్వాత .. తారక్ తెరమీదకు మళ్ళీ రాలేదు. దీనితో ఎన్టీఆర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు తమ ఫేవరేట్ హీరో ను స్క్రీన్ మీద చూద్దామా అని.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ.. ఎట్టకేలకు దసరా సమయానికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా “దేవర” సినిమాలోని ఓ సీన్ లీక్ అవ్వడంతో .. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమాపై హోప్స్ ఇంకాస్త పెంచేసినట్లు అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సమయంలో లీక్ అయిన ఆ సీన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

“దేవర” సినిమా రిలీజ్ డేట్ కు ఇంకా కొద్దీ నెలల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో.. ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం చిత్ర బృందం .. సినిమాలోని కొన్ని సీన్స్ ను గోవాలో షూట్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వీడియో కూడా.. గోవాలో జరిగే షూటింగ్ కు సంబంధించిందే. ఆ వీడియోలో ఎన్టీఆర్ బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని బీచ్ నుంచి నడుచుకొని బయటికి వస్తున్నారు. దీనితో ఇన్నాళ్లకు తారక్ ను చూడడంతో.. అది కూడా న్యూ లుక్ లో చూడడంతో.. ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపించింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ షేర్స్ చేస్తున్నారు అభిమానులు. వీడియోను గమనిస్తే మాత్రం ఎవరో దీనిని దూరం నుంచి షూట్ చేసినట్లుగా అర్ధమౌతుంది. ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ అయితే థ్రిల్ అయ్యారు కానీ, మేకర్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇకపై ఎటువంటి లీక్స్ అవ్వకుండా చూసుకోవడానికి చిత్ర బృందం అంతా.. జాగ్రత్త పడుతోంది.

ఇక ఈ చిత్రంలో తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అయితే, దేవర సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలలో కనిపించనున్నారట తారక్. మరి, దానిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ అదే కనుక నిజమైతే .. అభిమానులకు తారక్ ను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవని చెప్పి తీరాలి. ఇక దేవర సినిమాను అక్టోబర్ 10న దసరాకు రిలీజ్ చేయాలనీ డేట్ ఫిక్స్ చేశారు. సరిగ్గా అదే సమయంలో మరో రెండు బడా హీరోల చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఆయా సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఒకవేళ రిలీజ్ అయినా కూడా.. ఎన్టీఆర్ చిత్రానికి మాత్రం కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు అభిమానులు. మరి, ప్రస్తుతం దేవర చిత్రం నుంచి లీక్ అయినా ఓ సీన్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet