iDreamPost
android-app
ios-app

అనిల్ రావిపూడి.. చిరు కథనే వెంకీకి చెప్పాడా? ఇదిగో క్లారిటీ..

  • Published Feb 03, 2024 | 5:50 PM Updated Updated Feb 03, 2024 | 5:50 PM

గత కొంతకాతలంగా దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేశ్ తో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన కథను కూడా అనిల్ వెంకటెశ్ కు వినిపించారట. అయితే ఆ కథ గతంలో చిరంజీవికి చెప్పిన స్టోరీగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజమేమిటంటే..

గత కొంతకాతలంగా దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేశ్ తో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు సంబంధించిన కథను కూడా అనిల్ వెంకటెశ్ కు వినిపించారట. అయితే ఆ కథ గతంలో చిరంజీవికి చెప్పిన స్టోరీగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజమేమిటంటే..

  • Published Feb 03, 2024 | 5:50 PMUpdated Feb 03, 2024 | 5:50 PM
అనిల్ రావిపూడి.. చిరు కథనే వెంకీకి చెప్పాడా? ఇదిగో క్లారిటీ..

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. దాదాపు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ వరుస హిట్స్ కొట్టడంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అసలు అనీల్ రావిపూడి సినిమా అంటేనే కావలసినంత ఫన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మేంట్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తుంది. దీంతో ప్రేక్షకులు కూడా అనిల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా అనగానే ఆసక్తి చూపుతారు. ఎందుకంటే.. అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాలో కామెడీ, ఎమోషనల్ తో పాటు సమాజానికి ఉపాయోగపడే మంచి మెసెజ్ ను కూడా అందిస్తారు. కాగా, ఇటీవలే నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. గతకొన్ని రోజులుగా హీరో విక్టరి వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కనుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఇటీవలే అందుకు సంబంధించిన కథను కూడా అనిల్ వెంకటెశ్ కు వినిపించారట. అయితే ఆ కథ గతంలో చిరంజీవికి చెప్పిన స్టోరీగా వార్తలు వస్తున్నాయి.

దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి చిత్రం విక్టరీ వెంకటేశ్ తో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా అందుకు సంబంధించిన కథను కూడా అనిల్ ఇటీవలే వెంకటేశ్ కి వినిపించారని తెలుస్తోంది. దీంతో కథ నచ్చడంతో వెంకటేశ్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పైగా ఈ చిత్రన్ని దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనిల్ రావిపూడి వెంకటేశ్ కాంబోలో ఎఫ్2′, ‘ఎఫ్3’ వంటి సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అప్పట్లో ఈ రెండు సినిమాలు కూడా డబుల్ హ్యాట్రిక్ గా నిలిచాయి. అలాగే ఈ రెండు సినిమాలను దిల్ రాజ్ బ్యానర్ లోనే నిర్మించారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఆ మూవీకి సంబంధించిన అధికారక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని చెబుతున్నారు.

అయితే గత కొన్నిరోజులుగా మెగాస్టార్ చిరంజీవికి చెప్పిన క‌థే.. వెంక‌టేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని ప్రచారం జరుగుతోంది. కానీ, చిరంజీవి ఓ వైపు విశ్వంభర చేస్తుండటంతో.. ఈ కథ ఆగిపోయిందని, ఇప్పుడు అదే కథను విక్టరీ వెంకటేష్ కు వినిపించారనే టాక్ నడుస్తోంది. అయితే వెంకటేశ్ కు, చిరంజీవికి చెప్పిన కథ ఒకటి కాదని, రెండు వేర్వేరు అని సమాచారం. ఎందుకంటే.. వెంకటేశ్ కు చెప్పిన కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ కథని, ఇందులో ఇద్దరు హీరోయిన్ లు ఉంటారని, అలాగే చిరంజీవికి చెప్పిన కథలో ఒకరే హీరోయిన్ గా ఉంటారని తెలిసింది. దీంతో చిరంజీవికి, అనిల్ రావిపూడి చెప్పిన కథ వేరని, అది అలానే ఉందని.. పైగా వెంకటేశ్ తో తెరకెక్కనున్న సినిమా, చిరంజీవికి చెప్పిన కథ ఒకటి కాదని తేలిపోయింది. అలాగే అతి త్వరాలోనే హీరో వెంకటేశ్ తో అనిల్ రావిపూడి ఓ కొత్త సినిమాతో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి, చిరుకి, వెంకటేశ్ కి చెప్పిన కథ ఒకటి కాదనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom