iDreamPost
android-app
ios-app

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్​మెంట్.. పురస్కారాలు దక్కించుకుంది వీళ్లే..!

  • Published Aug 16, 2024 | 4:01 PM Updated Updated Aug 16, 2024 | 4:01 PM

70th National Film Awards List Of Winners: 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ తాజాగా ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఏయే పురస్కారాలను దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..

70th National Film Awards List Of Winners: 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ తాజాగా ప్రకటించింది. ఇందులో ఎవరెవరు ఏయే పురస్కారాలను దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 16, 2024 | 4:01 PMUpdated Aug 16, 2024 | 4:01 PM
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్​మెంట్.. పురస్కారాలు దక్కించుకుంది వీళ్లే..!

సినిమాలకు సంబంధించి ఎన్నో అవార్డులు ఇస్తుంటారు. మన దేశంలో చూసుకుంటే ఈ మధ్య ఇది మరింత ఎక్కువైంది. ఫిల్మ్​ఫేర్, సైమా అవార్డ్స్ అంటూ నటులు, టెక్నీషియన్స్ ప్రతిభను గుర్తిస్తూ పురస్కారాలు ఇచ్చే సంస్థలు చాలానే ఉన్నాయి. వీటి కృషి మెచ్చుకోదగిందే. అయితే ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు ఉండే గౌరవం, ప్రాముఖ్యత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్​ను ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి పురస్కారాలపై తాజాగా అనౌన్స్​మెంట్ వచ్చింది. 70వ చలనచిత్ర పురస్కారాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022, డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన మూవీస్​కు గానూ ఈ అవార్డులను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏయే పురస్కారాలు దక్కించుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ – ఆట్టం
బెస్ట్ యాక్టర్ – రిషబ్ శెట్టి
బెస్ట్ యాక్ర్రెస్ట్ – నిత్యా మీనన్, మీనాక్ష్మి పరేఖ్
బెస్ట్ డైరెక్టర్ – సూరజ్ బర్జాత్యా
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – నీనా గుప్తా
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – పవన్ మల్హోత్రా
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్​సమ్ ఎంటర్​టైన్​మెంట్ – కాంతారా
బెస్ట్ డెబ్యూ – ఫౌజా, ప్రమోద్ కుమార్
బెస్ట్ తెలుగు ఫిల్మ్ – కార్తికేయ 2
బెస్ట్ తమిళ్ ఫిల్మ్ – పొన్నియిన్ సెల్వన్ 1
బెస్ట్ పంజాబీ ఫిల్మ్ – బాఘీ ది ఢీ
బెస్ట్ ఒడియా ఫిల్మ్ – దమన్
బెస్ట్ మలయాళం ఫిల్మ్ – సౌది వెలక్కా సీసీ.225/2009
బెస్ట్ మరాఠీ ఫిల్మ్ – వాల్వీ
బెస్ట్ కన్నడ ఫిల్మ్ – కేజీఎఫ్​: ఛాప్టర్ 2
బెస్ట్ హిందీ ఫిల్మ్ – గుల్​మోహర్
స్పెషల్ మెన్షన్స్ – మనోజ్​ బాజ్​పాయ్ (గుల్​మోహర్), సంజయో సలీల్ చౌదరి ( కాలిఖాన్)
బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ – కేజీఎఫ్: ఛాప్టర్ 2
బెస్ట్ కొరియోగ్రఫీ – తిరుచిత్రాంబళం
బెస్ట్ లిరిక్స్ – ఫౌజా
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ప్రీతమ్ (సాంగ్స్), ఏఆర్ రెహ్మాన్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
బెస్ట్ మేకప్ – అపరాజితో
బెస్ట్ కాస్ట్యూమ్స్ – కుచ్ ఎక్స్​ప్రెస్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – అపరాజితో
బెస్ట్ ఎడిటింగ్ – ఆట్టం
బెస్ట్ సౌండ్ డిజైన్ – పొన్నియిన్ సెల్వన్ 1
బెస్ట్ స్క్రీన్ ప్లే – ఆట్టం
బెస్ట్ డైలాగ్స్ – గుల్​మోహర్
బెస్ట్ కొరియోగ్రఫీ – పొన్నియిన్ సెల్వన్ 1
బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ – బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్), సౌది వెలక్కా సీసీ.225/2009
బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ – అర్జిత్ సింగ్ (కేసరియా): బ్రహ్మాస్త్ర