iDreamPost
android-app
ios-app

రేపే ప్రభాస్ కొత్త మూవీ పూజ! టైటిల్ ఏంటంటే?

  • Published Aug 16, 2024 | 2:51 PM Updated Updated Aug 16, 2024 | 2:51 PM

Prabhas New Project Pooja Ceremony: డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సినిమా చేస్తూనే మరో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోయాడు. రేపు కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారని తెలుస్తోంది.

Prabhas New Project Pooja Ceremony: డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఒక సినిమా చేస్తూనే మరో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోయాడు. రేపు కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారని తెలుస్తోంది.

  • Published Aug 16, 2024 | 2:51 PMUpdated Aug 16, 2024 | 2:51 PM
రేపే ప్రభాస్ కొత్త మూవీ పూజ! టైటిల్ ఏంటంటే?

డార్లింగ్ ప్రభాస్ కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత స్పిరిట్, సలార్ 2 వంటి ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. అలాగే హను రాఘవపూడి సినిమాకి సంబంధించి కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఎలా లేదన్నా కూడా ఒకేసారి కనీసం రెండు సినిమాలు షూట్ చేయాల్సిందే అందుకే ఇప్పుడు రాజా సాబ్ ఉండగానే.. మరో సినిమాని పట్టాలు ఎక్కించేందుకు రెడీ అయిపోతున్నాడు. రేపే ఇంకో సినిమాకి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి.. ఆ మూవీ ఏది? టైటిల్ ఏమై ఉంటుందో చూద్దాం.

ప్రభాస్ నుంచి సినిమా అంటే పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులు అలర్ట్ అయిపోతారు అనే విషయం తెలిసిందే. ఇటీవల కల్కి 2898 ఏడీ మూవీతో గట్టిగానే రికార్డులు క్రియేట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు. ఇప్పుడు అదే స్వింగుతో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. ఇప్పుడు పూజా కార్యక్రమం అని చెప్పుకుంటున్న సినిమా మరేదో కాదు.. హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ప్రాజెక్టే. ఇందుకు సంబంధించి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రేపు ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఈ మూవీకి ఫౌజీ అనే పేరు పెట్టారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సగంతి తెలిసిందే. అందులో ఎంతో కొంత నిజం లేకపోతే ఈ స్థాయి వార్తలు రావు. కాబట్టి సినిమాకి పేరు దాదాపుగా ఫౌజీనే అయి ఉంటుంది అంటున్నారు.

ఈ సినిమా జస్ట్ ప్రేమకథ మాత్రం కాదు అంటున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’లో సభ్యునిగా నేతాజీతో కలిసి యుద్ధం చేస్తాడు అంటున్నారు. అలాగే ఇందులో ఒక ప్రేమకథ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది అని వార్తలు వచ్చాయి. కానీ, తాను ఆ సినిమాలో చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు టైటిల్ గురించే కాకుండా.. హీరోయిన్ ఎవరు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే రేపటి దాకా ఆగాల్సిందే. కనీసం వర్కింగ్ టైటిల్ అయినా తెలుస్తుంది. మరి.. ప్రభాస్- హను రాఘవపూడి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom