iDreamPost
android-app
ios-app

Tollywood: రామ్‌చరణ్‌ సినిమాలో ఆ హీరో.. తెలుగు సినిమా చేయనంటూనే

  • Published Feb 10, 2024 | 1:08 PM Updated Updated Feb 10, 2024 | 1:08 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో RC16 సినిమాను చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ బడా స్టార్ హీరో కూడా నటించనున్నారు. ఇంతకి ఆయనేవరంటే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో RC16 సినిమాను చేయనున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ బడా స్టార్ హీరో కూడా నటించనున్నారు. ఇంతకి ఆయనేవరంటే..

  • Published Feb 10, 2024 | 1:08 PMUpdated Feb 10, 2024 | 1:08 PM
Tollywood: రామ్‌చరణ్‌ సినిమాలో ఆ హీరో.. తెలుగు సినిమా చేయనంటూనే

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’. ఈ పేరు తెలుగు ప్రేక్షకుల అందరికి సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తన ఇన్నాళ్ల కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, అవేవి పట్టించుకోకుండా, ఒక నటుడిగా తనని తాను నిరుపించుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఈ క్రమంలోనే.. విమర్శలను సైతం ప్రశంసలుగా మలుచుకున్నారు. కాగా, ఇటీవలే RRR మూవీతో ఏకాంగా.. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై చరణ్ ఫ్యాన్స్ కు మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక శంకర్ కూడా ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తీసుపోకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నా విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనతో RC16 సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ బడా స్టార్ హీరో చేయునున్నారని టాక్ వినిపిస్తుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్ లో RC16 సినిమాను చేయనున్నారు. అయితే ఈ సినిమా క్రీడా నేపథ్యంలో రాబోతుందనే సమాచారం లీకైంది. అంతేకాకుండా.. ఇందులో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉండే కీలక పాత్రం కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో ‘జాన్ అబ్రహం’ ను తీసుకున్నారని తెలిసింది. ఇందులో అతడి రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఇక ఈ సినిమా కోసం గతంలో జాన్ అబ్రహంను తెలుగులో సినిమా చేయమని అడగగా.. ఆయన జాన్ చేయనని చెప్పాడు. కానీ మళ్లీ రామ్ చరణ్ కోసం మరోసారి అతడిని ఒప్పించారని ఇండస్ట్రీలో పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, ఇద్దరి స్టార్ హీరోల కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దాదాపు రూ.400 కోట్లు బడ్జెట్ తో రూపొందనుంది. అలాగే ఈ చిత్రన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

ఇక భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాలో.. చాలామంది పెద్ద స్టార్లు భాగం కాబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ‘విజయ్ సేతుపతి’, ‘శివ రాజ్‌కుమార్’ సహా ఎంతో మందిని ఫైనల్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంగా.. మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. మరి, రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ స్టార్ జన్ అబ్రహం నటిస్తున్నారనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss