గర్ల్ ఫ్రెండ్‌కి లిప్ లాక్ ఇస్తున్నారా? జాగ్రత్త మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు!

లిప్ లాక్ పాచి మొఖాన పెట్టుకుంటేనే డేంజర్ అంటుంటే.. ఇప్పుడు ఫ్రెష్ గా పళ్ళు తోముకుని పెట్టుకున్నా డేంజర్ అనే అంటున్నారు నిపుణులు. గర్ల్ ఫ్రెండ్ కి, బాయ్ ఫ్రెండ్ కి లిప్ కిస్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..

లిప్ లాక్ పాచి మొఖాన పెట్టుకుంటేనే డేంజర్ అంటుంటే.. ఇప్పుడు ఫ్రెష్ గా పళ్ళు తోముకుని పెట్టుకున్నా డేంజర్ అనే అంటున్నారు నిపుణులు. గర్ల్ ఫ్రెండ్ కి, బాయ్ ఫ్రెండ్ కి లిప్ కిస్ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..

పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అనేవారు. ఇప్పుడు ప్రేమగా పెట్టుకునే లిప్ లాక్ కూడా హానికరం అనే అంటున్నారు. లిప్ లాక్ అనేది చాలా కామన్ అయిపోయింది. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లోనే లిప్ కిస్సులు పెట్టేసుకుంటున్నారు. సినిమాల ప్రభావం వల్ల ఈ ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. ప్రేమించిన అమ్మాయినో, అబ్బాయినో లిప్ లాక్ పెట్టుకోవడం అనేది సహజమైన ప్రక్రియ. ఆ అనుభూతి మధురంగా ఉంటుంది. ముద్దొచ్చినప్పుడు బుగ్గ మీద, నుదిటి మీద పెట్టుకోవడం మామూలే కానీ మరీ ఎక్కువ ముద్దొచ్చినప్పుడు పెదవులపై ముద్దు పెడుతుంటారు. అయితే ఈ కల్చర్ ప్రేమికుల మధ్యనే కాకుండా మామూలు వ్యక్తుల మధ్య కూడా ఎక్కువైపోయింది. అసలు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియని ప్రేమికులు లిప్ లాక్ లు ఇచ్చుకుంటేనే తప్పని చెప్పే ఈ సమాజంలో జస్ట్ ఫ్రెండ్ షిప్ అని చెప్పి ముద్దులు పెట్టేసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు. లిప్ లాక్ లు ఇచ్చుకోవడం.. దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం.. ఈ మధ్య మరీ ఎక్కువైంది ఈ ట్రెండు.

బైకుల మీద వెళ్తూ లిప్ లాకులు ఇచ్చుకోవడం, మెట్రో రైల్లో ఒకరి ఒడిలో ఒకరు కూర్చుని ఇచ్చుకోవడం.. ఈ దారుణాలు చూడలేక నెటిజన్స్ తిట్లు తిట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెంట ఎక్కువైపోయింది. అయితే ఇష్టమొచ్చినట్టు లిప్ లాక్ లు ఇచ్చుకుంటూ కూర్చుంటే డేంజరే అంటున్నారు పరిశోధకులు. లిప్ టూ లిప్ కిస్ పెట్టుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. క్యాలరీలు బర్న్ అవ్వడం మాటలా ఉంచితే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయంటున్నారు. లిప్ లాక్ ల వల్ల జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. మోనోన్యూక్లియోసిస్, మెనింజైటిస్ వంటి వైరస్ లు వ్యాపిస్తాయని అంటున్నారు. మోనోన్యూక్లియోసిస్ కారణంగా ఆరు నెలల పాటు విపరీతమైన అలసట కనిపిస్తుందని.. మెనింజైటిస్ కారణంగా మెదడువాపు వ్యాధులు వ్యాపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మెదడు వాపు వ్యాధి పందుల నుంచి వ్యాపిస్తుందని అంటారు. మెదడు వాపు వ్యాధి అనేది ప్రాణాంతక వ్యాధి. లిప్ లాక్ వల్ల క్లామిడియా, గనేరియా వంటి లైంగిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని.. లైంగిక వ్యాధులు కూడా లిప్ లాక్ వల్ల త్వరగా వ్యాపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

అలర్జీ ఉన్నవాళ్ళని లిప్ లాక్ పెట్టుకునే 12 శాతం మందికి అలర్జీ త్వరగా సోకుతుందని స్వీడిష్ సర్వేలో తేలింది. తీవ్ర అనారోగ్యం, ఫ్లూ, వైరస్ బారిన పడిన వారికి లిప్ లాక్ పెట్టకపోవడమే మంచిదని.. ఈ విషయంలో వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. లిప్ కిస్సుల వల్ల దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయని.. దురద, వాపు సమస్యలతో బాధపడేవారు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. లిప్ లాక్ వల్ల శరీరంలోకి న్యూమోనియా బ్యాక్టీరియా ప్రవేశిస్తుందని.. కొంతమందికి వాంతులు అవుతాయని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు, ముఖం వాపు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి మీ గర్ల్ ఫ్రెండ్ ని గానీ.. బాయ్ ఫ్రెండ్ ని గానీ లిప్ లాక్ పెట్టుకునే ముందు జాగ్రత్త. ఏరి కోరి అనారోగ్య సమస్యలు తెచ్చుకోగలరు. ఈ కథనాన్ని మీ బెస్టీలకి షేర్ చేయండి. అలానే దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments