iDreamPost
android-app
ios-app

54 వేల గో ప్రో 5K కెమెరా 21 వేలకే! ఇంతకంటే మంచి డీల్ దొరకదు!

  • Published Aug 06, 2024 | 11:00 PM Updated Updated Aug 06, 2024 | 11:00 PM

వెకేషన్స్ లేదా ట్రిప్స్​కు వెళ్లేటప్పుడు వెంట కెమెరా ఉండాల్సిందే. మొబైల్ కెమెరా ఉంది కదా.. ఇంకా సెపరేట్​గా కెమెరా ఎందుకని అనుకోవచ్చు. కానీ ఫోన్​తో కంపేర్ చేస్తే కెమెరాల్లో వచ్చే ఫొటో క్వాలిటీ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

వెకేషన్స్ లేదా ట్రిప్స్​కు వెళ్లేటప్పుడు వెంట కెమెరా ఉండాల్సిందే. మొబైల్ కెమెరా ఉంది కదా.. ఇంకా సెపరేట్​గా కెమెరా ఎందుకని అనుకోవచ్చు. కానీ ఫోన్​తో కంపేర్ చేస్తే కెమెరాల్లో వచ్చే ఫొటో క్వాలిటీ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

  • Published Aug 06, 2024 | 11:00 PMUpdated Aug 06, 2024 | 11:00 PM
54 వేల గో ప్రో 5K కెమెరా 21 వేలకే! ఇంతకంటే మంచి డీల్ దొరకదు!

వెకేషన్స్ లేదా ట్రిప్స్​కు వెళ్లేటప్పుడు వెంట కెమెరా ఉండాల్సిందే. మొబైల్ కెమెరా ఉంది కదా.. ఇంకా సెపరేట్​గా కెమెరా ఎందుకని అనుకోవచ్చు. కానీ ఫోన్​తో కంపేర్ చేస్తే కెమెరాల్లో వచ్చే ఫొటో క్వాలిటీ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడంటే అందరూ ఫోన్ కెమెరాలను వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ఫొటోలు, వీడియోలు క్యాప్చర్ చేయడానికి కెమెరాలనే ఉపయోగించేవారు. కెమెరా ఇంట్లో ఉంటే అదో స్టేటస్ సింబల్​లా భావించేవారు. ఎక్కడైనా టూర్లకు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు వెంట కెమెరా తీసుకెళ్లేవారు. దాంతో తీసిన ఫొటోలను తర్వాత ఆల్బమ్స్​లా చేయించి ఇంట్లో భద్రంగా దాచుకునేవారు.

క్రమంగా మొబైల్ వాడకం పెరగడం, ఆయా కంపెనీలు సూపర్ క్వాలిటీ కెమెరా ఆప్షన్లతో ఫోన్లను మార్కెట్​లోకి తీసుకురావడంతో కెమెరాల వాడకం తగ్గింది. అయితే ఇప్పటికి కూడా కెమెరాలు వాడేవారు చాలా మందే ఉన్నారు. ఫొటోలు తీసే హాబీ ఉన్నవారు మంచి క్వాలిటీ కోసం కెమెరాల మీదే ఆధారపడుతున్నారు. అయితే మునుపటిలా కాదు.. ఇప్పుడు కెమెరా తయారీల్లో అప్​గ్రెడేషన్ పెరిగింది. యంగ్ జనరేషన్​ ఇష్టపడేలా వాళ్ల టేస్ట్​కు తగ్గట్లు హైక్వాలిటీ ఇమేజెస్, లో లైట్​లోనూ మంచి క్వాలిటీతో ఫొటోస్ తీసేలా కెమెరాలను రూపొందిస్తున్నారు. అలాంటి అడ్వాన్స్​డ్ కెమెరాపై మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. 55 వేల ఖరీదు చేసే 5కే కెమెరా 21 వేలకే వస్తోంది.

5K camera for 21 thousand

గో ప్రో కంపెనీకి చెందిన వాటర్​ప్రూఫ్ యాక్షన్ 5డీ కెమెరాపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.54,500 ఖరీదు చేసే ఈ కెమెరా మీద 58 శాతం డిస్కౌంట్​తో రూ.22,990కే ఇస్తున్నారు. ఎస్​బీఐ కార్డు మీద తీసుకుంటే ఇంకో రూ.2,174 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు రూ.20,990కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ వాటర్​ప్రూఫ్ కెమెరాను నీళ్లలో 33 ఫీట్ల లోతు వరకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ప్రీమియం కెమెరా కావాలనుకుంటే సోనీ ఆల్ఫా ఐఎల్​సీఏ-7ఎం3 బెస్ట్ ఆప్షన్ అని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. రూ.1,67990 విలువ చేసే ఈ కెమెరా ఇప్పుడు ఆఫర్ కింద రూ.1,27,489కి వస్తోంది. ఇంకా హై రేంజ్ కెమెరా కావాలనుకుంటే సోనీ ఆల్ఫా ఐఎల్​సీఏ-7ఎం4 మంచి ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ 33 మెగాపిక్సల్ కెమెరా అసలు ధర రూ.2,47,990. కానీ ఇప్పుడు ఆఫర్ కింద రూ.2,09,990కి అందుబాటులో ఉంది.